మారటోరియం ఊరట

ABN , First Publish Date - 2021-07-22T05:04:29+05:30 IST

కరోనా నేపథ్యంలో బ్యాంకులకు ఈఎంఐలు గుదిబండగా మారాయి.

మారటోరియం ఊరట

రెండేళ్లపాటు ఈఎంఐలపై వెసులుబాటు


పాలకొల్లు, జూలై 15: కరోనా నేపథ్యంలో బ్యాంకులకు ఈఎంఐలు గుదిబండగా మారాయి. పలు బ్యాంకులు రుణాల వసూళ్లకు తంటాలు పడుతున్నాయి. ఈ పరి స్థితుల్లో రిజర్వుబ్యాంకు కల్పించిన వెసులబాటుతో ఈఎంఐలపై బ్యాం కులు మారటోరియం ఇస్తున్నాయి. ఆరు నెలల గుడువు నుంచి గరిష్ఠంగా 24 నెలల పాటు మారటోరియం వర్తింపచేసుకునే అవకాశం ఉంది. రుణగ్రహీతలు కరోనాకు ముందు పొందుతున్న ఆదాయం, ప్రస్తుతం వస్తున్న ఆదాయం లెక్కించి ఆదాయం గణనీయంగా తగ్గిన ఖాతాదారులకు గరిష్టంగా 24 నెలలు పాటు వాయిదాలు చెల్లించే అవసరం లేకుండా వెసులుబాటు ఇస్తున్నారు.


ఈఎంఐ భారం పెరగొచ్చు..


మారటోరియం గడువు ముగిసిన అనంతరం చెల్లించే ఈఎంఐల్లో కొంత పెరుగు దల కనిపించే అవకాశాలున్నాయని బ్యాంకింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. మారటో రియం సమయంలో చెల్లించకుండా బకాయి పెట్టిన మొత్తం వాయిదా సొమ్ముకి సాధారణ వడ్డీని విధించాలని, ఈఎంఐ మొత్తం పెంచకుండా రుణకాల పరిమితి పెంచాలని పలువురు ఆర్థిక నిపుణులు ఇప్పటికే రిజర్వు బ్యాంకులకు సూచించారు. ఇలాచేయడం ద్వారా రుణగ్రహీతలకు ఈఎంఐ భారం పెరగకుండా ఉండడమే కాకుండా బ్యాంకులకు ఎన్‌పీఏ శాతం తగ్గుతుందని సూచించిన పరిస్థితుల్లో ఈ అంశం రిజర్వు బ్యాంకు పరిశీలనలో ఉంది. గత ఆర్థిక సంవత్సరానికి ముందు వాణిజ్య బ్యాంకులలో కేవలం 3 శాతం లోపుగానే ఎన్‌పీఏ (నిరర్ధక ఆస్తులు) ఖాతా లు ఉండేవి. 2020–21 ఆర్థిక సంవత్సరంలో కరోనా కారణంగా ఎన్‌పీఏ ఖాతాలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు వివిధ బ్యాంకుల్లో ఎన్‌పీఏ ఖాతాలు కనిష్ఠంగా 3, గరిష్టంగా 7 శాతానికి పెరిగాయి. బ్యాంకులు రుణ వాయిదాల రికవరీ పెంచుకో డా నికి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నప్పటికీ ఎన్‌పీఏ ఖాతాలు గుదిబండగానే ఉన్నాయి. ఈఎంఐలపై మారటోరియం సదుపాయం కల్పించి రుణగ్రహీతలకు తాత్కాలిక ఉపశమనం కలిగించే ప్రక్రియలో పాలకొల్లు ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచి ముందం జలో ఉంది. కొన్ని బ్యాంకులు ఖాతాదారులకు ఫోన్‌చేసి మారటోరియం అవకాశాన్ని కావాలంటే వినియోగించు కోవచ్చునని సూచిస్తుండగా పలు బ్రాంచిల్లో ఈపనితో తమకు సంబంఽధం లేన్నట్లుగా ప్రవర్తిం చడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.


జిల్లాలో ఇచ్చిన రుణాలు


జిల్లాలోని అన్ని బ్యాంకులలో 35,861 ఖాతాలకు రూ. 3121.5 కోట్లు గృహ రుణాలు, 9,151 ఖాతాలకు రూ.386.12 కోట్లు విద్యా రుణాలు, 1,57,484 ఖాతాలకు రూ.3675.8 కోట్లు ఇతర రుణాలు తీసుకున్నారు. ఇందులో గృహ రుణాలు, విద్యా రుణాలపై అత్యధికంగా మారటోరియం కోసం దరఖాస్తులు వచ్చినట్లు బ్యాంకింగ్‌ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2021-07-22T05:04:29+05:30 IST