Abn logo
Jul 7 2020 @ 00:00AM

కలిసిమెలిసి ఉంటే...!

ఒక అడవిలో జింక, తాబేలు, కాకి, ఎలుక స్నేహంగా, సంతోషంగా జీవిస్తూ ఉండేవి. ఒకరోజు జింక వేటగాడి ఉచ్చులో చిక్కుకుంది. ఆ విషయాన్ని గమనించిన తాబేలు, కాకి, ఎలుక, స్నేహితుడైన జింకను కాపాడటం కోసం ఒక పథకం వేశాయి. ఆ పథకం ప్రకారం జింక చనిపోయినట్టుగా పడుకుంది. దానిపై కాకి కూర్చుని, చనిపోయిన జింకను తింటున్నట్టు నటించసాగింది. సరిగ్గా అప్పుడే వేటగాడు వస్తున్నాడు. అది చూసిన తాబేలు వేటగాడికి కనిపించేలా దారిని దాటుకుంటూ వెళ్లింది. జింకను చేరుకున్న వేటగాడు అది చనిపోయిందని భావించి, తాబేలునైనా పట్టుకుందామని వెనక్కి మళ్లాడు. వెంటనే ఎలుక ఉచ్చుని కొరికేసింది. ఒక్క ఉదుటున జింక లేచి పరుగెట్టింది. తాబేలు తప్పించుకుంది. అన్నీ మళ్లీ కలుసుకుని సంతోషంగా జీవించాయి.

Advertisement
Advertisement
Advertisement