ధరలను అదుపు చేయలేని మోదీ దిగిపోవాలి

ABN , First Publish Date - 2022-05-28T05:50:17+05:30 IST

పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో పాటు పెట్రోల్‌, డీజీల్‌, వంట గ్యాస్‌ ధరలను అదువు చేయలేని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దిగిపోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు

ధరలను అదుపు చేయలేని మోదీ దిగిపోవాలి
హుజూర్‌నగర్‌ ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న వామపక్ష నాయకులు

సూర్యాపేట సిటీ / నడిగూడెం / తిరుమలగిరి / చింతలపాలెం / గరిడేపల్లి రూరల్‌ / ఆత్మకూర్‌(ఎస్‌) / మఠంపల్లి / హుజూర్‌నగర్‌, మే 27 : పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో పాటు పెట్రోల్‌, డీజీల్‌, వంట గ్యాస్‌ ధరలను అదువు చేయలేని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దిగిపోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, ఇతర వామపక్షపార్టీల నాయకులు డిమాండ్‌ చేశారు. ధరల పెరుగుదలను నిరసిస్తూ జిల్లాలోని పలు మండలాల్లో వామపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం రెవెన్యూ కార్యాలయాల ఎదుట ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి, తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ఎన్నికల హామీలను నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, ఎల్గూరి గోవిందు, కోట గోపీ, జిల్లా నాయకులు మూరగుండ్ల లక్ష్మయ్య, దోరేపల్లి శంకర్‌, ఎర్ర అఖిల్‌, జీవన్‌, ఎస్‌కే నజీర్‌, ఏపూరి సోమన్న, వెల్పుల వెంకన్న పాల్గొన్నారు. నడిగూడెంలో జరిగిన ధర్నాలో సీపీఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ, ఎస్‌కె సైదాహుస్సేన్‌, కొరట్ల వెంకటేశ్వర్లు, కాసాని వెంకన్న, లింగయ్య, రవి, లక్ష్మినారాయణ పాల్గొన్నారు. తిరుమల గిరిలో జరిగిన ధర్నాలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు యాదగిరిరావు, యాకయ్య, లక్ష్మి, నగేష్‌, సోమయ్య, శ్రీను, వెంకటయ్య పాల్గొన్నారు. చింతలపాలెం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నాలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉసైల నారాయణరెడ్డి, చింత్రియాల రవి, గోనె అంకయ్య, అంకరాజు, సురేందర్‌, కొండలు పాల్గొన్నారు. గరిడేపల్లి మండల కేంద్రంలోని కోదాడ-మిర్యాలగూడ ప్రధాన రహదారిపై వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు, సీపీఎం మండల కార్యదర్శి షేక్‌ యాకుబ్‌, సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ డివిజన్‌ నాయకులు ఆదూరి కోటయ్య, త్రిపురం సుధాకర్‌రెడ్డి, కామళ్ల నవీన్‌, మైబెల్లి, బాదె నర్సయ్య, మర్రి నాగేశ్వరరావు, యానాల సోమయ్య, కామళ్ల శ్రీను పాల్గొన్నారు. ఆత్మకూర్‌(ఎస్‌)  మండల కేంద్రంలో జరిగిన ధర్నాలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు దండా వెంకట్‌రెడ్డి, నాయకులు అవిరె అప్పయ్య, సుందర్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, నారాయణ, ఉపేందర్‌ పాల్గొన్నారు. మఠంపల్లిలో జరిగిన ధర్నాలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు భూక్య పాండునాయక్‌, మండల కార్యదర్శి మాలోతు బాలునాయక్‌, సీనియర్‌ నాయకులు శాగంరెడ్డి జగన్మోహన్‌రెడ్డి, సయ్యద్‌ రన్‌మియా, కంటు వెంకటేవ్వర్లు,జాల తిరపయ్య, పొద్దిల సైదులు పాల్గొన్నారు. హుజూర్‌నగర్‌లో ఆర్డీవో కార్యాలయం ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనం తరం ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. కార్యక్ర మంలో వామపక్షాల నాయకులు గుండు వెంకటేశ్వర్లు, నాగారపు పాండు, కాకి అజయ్‌రెడ్డి, యల్లావుల రాములు, దుగ్గి బ్రహ్మం, పోటు లక్ష్మయ్య, పాలకూరి బాబు, హుస్సేన్‌, రమేష్‌, వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, కంబాల శ్రీను, శీలం శ్రీను, మల్లేశ్వరి, వెంకయ్య, సుజాత, యల్లావుల ఉమ, రమేష్‌, వాసుదేవరావు, హుస్సేన్‌,  ప్రకాశ్‌, సోమయ్యగౌడ్‌ పాల్గొన్నారు.



Updated Date - 2022-05-28T05:50:17+05:30 IST