బాలీవుడ్ తారలకు పీఎం మోదీ ధన్యవాదాలు

ABN , First Publish Date - 2020-04-01T03:11:03+05:30 IST

పీఎం-కేర్స్ నిధికి విరాళాలు ఇవ్వడంతోపాటు కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న బాలీవుడ్ తారల

బాలీవుడ్ తారలకు పీఎం మోదీ ధన్యవాదాలు

న్యూఢిల్లీ : పీఎం-కేర్స్ నిధికి విరాళాలు ఇవ్వడంతోపాటు కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న బాలీవుడ్ తారలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. 


నోవల్ కరోనా వైరస్ మహమ్మారితో పోరాడేందుకు ప్రధాని పిలుపు మేరకు కార్తిక్ ఆర్యన్ మొదలుకొని అజయ్ దేవ్‌గన్ వరకు అనేక మంది బాలీవుడ్ తారలు విరాళాలు ప్రకటించారు. ప్రధాన మంత్రి సిటిజెన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ (పీఎం-కేర్స్) నిధికి వీరు విరాళాలు ఇచ్చారు. 


ఈ నేపథ్యంలో మోదీ మంగళవారం ఓ ట్వీట్ ద్వారా బాలీవుడ్ తారలకు ధన్యవాదాలు తెలిపారు. 


‘‘భారత దేశపు తారలు దేశ ఆరోగ్యాన్ని కాపాడటంలో సైతం కథానాయక పాత్ర పోషిస్తున్నారు. వారు అవగాహన పెంచడంలో అదేవిధంగా పీఎం-కేర్స్‌కు విరాళాలివ్వడంలో నాయకత్వ పాత్ర పోషిస్తున్నారు, ధన్యవాదాలు నానా పటేకర్, అజయ్ దేవ్‌గన్, ఆర్యన్ కార్తిక్, శిల్ప షెట్టి’’ అని మోదీ పేర్కొన్నారు. 


విరాళాలు ఇచ్చిన సింగర్స్ గురు రణధవ, బాద్షాలను కూడా మోదీ ధన్యవాదాలు తెలిపారు. పీఎం-కేర్స్‌కు అన్ని రంగాలవారు విరాళాలు ఇస్తున్నారని, వారంతా తమ కష్టార్జితాన్నికోవిడ్-19పై పోరాటాన్ని పదునెక్కించేందుకు ఇస్తున్నారని పేర్కొన్నారు. 


ఈ విరాళాల వల్ల కరోనా వైరస్‌ను ఓడించేందుకు పరిశోధనను ప్రోత్సహిస్తాయని మోదీ పేర్కొన్నారు. 


పీఎం-కేర్స్ నిధిని మోదీ మార్చి 28న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిధికి విరాళాలు ఇచ్చినవారిలో బాలీవుడ్ సెలబ్రిటీలు అక్షయ్ కుమార్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, అలియా భట్, సారా అలీ ఖాన్, వరుణ్ ధావన్, అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా ఉన్నారు. 


Updated Date - 2020-04-01T03:11:03+05:30 IST