ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి ప్రధాని మోదీ ఫోన్‌

ABN , First Publish Date - 2022-03-07T18:29:08+05:30 IST

‘ఆపరేషన్ గంగ’ పేరుతో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను ఇక్కడికి తరలిస్తున్నారు. ఇప్పటిదాకా ఉక్రెయిన్ నుంచి 76 విమానాల్లో 15,920 మంది భారతీయులు స్వదేశానికి చేరవేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అటు కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం ఓ ‘ముఖ్యమైన ప్రకటన’ను జారీ చేసింది..

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి ప్రధాని మోదీ ఫోన్‌

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్లో మాట్లాడారు. దాదాపు 35 నిమిషాల పాటు జెలెన్‌తో ఆయన మాట్లాడారు.‌ ఇరు నేతలు ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితులపై చర్చించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించడానికి సహకరించినందుకు జెలెన్‌స్కీకి మోదీ కృతజ్ఞతలు తెలిపినట్లు సమాచారం. అలాగే ఇప్పటికి మిగిలిపోయిన భారతీయులను సూమి నుంచి తరలించేందుకు సహకరించాలని జెలెన్‌స్కీని మోదీ కోరారు.


‘ఆపరేషన్ గంగ’ పేరుతో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను ఇక్కడికి తరలిస్తున్నారు. ఇప్పటిదాకా ఉక్రెయిన్ నుంచి 76 విమానాల్లో 15,920 మంది భారతీయులు స్వదేశానికి చేరవేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అటు కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం ఓ ‘ముఖ్యమైన ప్రకటన’ను జారీ చేసింది. ఉక్రెయిన్‌లో సొంత ఆవాసాల్లో ఉన్న భారతీయులు ఆదివారం ఉదయం 10 గంటల్లోపు (స్థానిక కాలమానం ప్రకారం) హంగరీ రాజధాని బుడాపె్‌స్టలోని ‘హంగరియా సిటీ సెంటర్‌’కు చేరుకోవాలని సూచించింది. తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో ఓ గూగుల్‌ దరఖాస్తును పోస్ట్‌ చేశామని.. ఇంకా ఉక్రెయిన్‌లోని యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయులంతా తమ వివరాలను వెంటనే అందులో పొందుపర్చాలని సూచించింది.

Updated Date - 2022-03-07T18:29:08+05:30 IST