‘నెల మామూళ్ల’పై కొరడా...!

ABN , First Publish Date - 2020-02-20T09:10:58+05:30 IST

మోడల్‌ స్కూళ్ల విభాగంలో ‘నెల మామూళ ్ల’పై కొరడా ఝుళిపించారు. మూడున్నర గంటలపాటు విచారణ చేశారు. అదే విధంగా ట్రెజరీ ద్వారా కూడా ఆరా తీశారు.

‘నెల మామూళ్ల’పై కొరడా...!

సీనియర్‌ అసిస్టెంట్‌ సస్పెన్షన్‌... 

మరో ప్రిన్సిపాల్‌, టీచర్‌పై కూడా వేటు: డీఈఓ వెల్లడి


అనంతపురం విద్య, ఫిబ్రవరి 19 : మోడల్‌ స్కూళ్ల విభాగంలో ‘నెల మామూళ ్ల’పై కొరడా ఝుళిపించారు. మూడున్నర గంటలపాటు విచారణ చేశారు. అదే విధంగా ట్రెజరీ ద్వారా కూడా ఆరా తీశారు. డబ్బులు వసూళ్లు నిజమని తేలడంతో విభాగం సీనియర్‌ అసిస్టెంట్‌ సూర్యనారాయణరెడ్డిని సస్పెండ్‌ చేశారు. మోడల్‌ స్కూళ్లు, హాస్టళ్లలో ఉద్యోగుల జీతాలు బిల్లులు, అరియర్స్‌ పెట్టేందుకు మామూళ్ల వసూళ్లు చేస్తున్నారంటూ ‘అక్కడ నెల మామూళ్లు’ శీర్షికన బుధవారం ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమయింది. ఈ కథనం విద్యాశాఖ, మోడల్‌ స్కూల్‌ ఉద్యోగులలో తీవ్ర చర్చనీయాంశమైంది. రాప్తాడు మోడల్‌ స్కూల్లో  మోడల్‌ స్కూల్స్‌, హాస్టల్‌ ఉద్యోగులతో జరుగుతున్న సమావేశానికి డీఈఓ శామ్యూల్‌ అకస్మాత్తుగా హాజరయ్యారు. ఆర్‌ఎంఎ్‌సఏ ఉద్యోగులను అక్కడి నుంచి బయటకు పంపారు. ప్రిన్సిపాళ్లు, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులను వేర్వేరుగా కూర్చోబెట్టి విచారణ చేశారు.  ఈ సందర్భంగా ప్రిన్సిపాళ్లు జీతాల బిల్లులు పెట్టడానికి నెలనెలా అధికారులు డబ్బులు తీసుకుంటున్నట్లు ఫిర్యాదు చేశారు.


కొందరు మౌఖికంగా ఫిర్యాదు చేయగా, ఒకరు లిఖిత పూర్వకంగా రాయించి ఇచ్చారు. రూ. 500 ఆఫీస్‌ కోసం, రూ. 100 ట్రెజరీ వాళ్ల కోసమని వసూలు చేస్తున్నారంటూ డీఈఓకు ఫిర్యాదు చేశారు. ఉద్యోగులు చెప్పిన విషయాలు విన్న డీఈఓ విస్తుపోయారు. జీతాల బిల్లుల కోసం డబ్బులు అడుగుతుంటే ఎందుకు ఇస్తున్నారని, తనకెందుకు చెప్పలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. దీనిపై మధ్యాహ్నం 1.30 గంటల వరకూ విచారణ చేశారు. తర్వాత ఆ విభాగం సీనియర్‌ అసిస్టెంట్‌ సూర్యనారాయణరెడ్డిని సస్పెండ్‌ చేశారు. విచారణలో డబ్బు వసూలు నిజమేనని తేలిందన్నారు.  ఉద్యోగులతోపాటు, ట్రెజరీ అధికారులను కూడా విచారణ చేశామన్నారు. విరణలో ఆరోపణలు రుజువు కావడంతో సస్పెండ్‌ చేసినట్లు డీఈఓ తెలిపారు.


మరో ఇద్దరిపై వేటు

రాయదుర్గం మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ప్రకాష్‌నాయుడుపై ఆరోపణలు వచ్చాయని డీఈఓ తెలిపారు. దీనిపై విచారణ చేసి ప్రకా్‌షనాయుడుని సస్పెండ్‌ చేసినట్లు పేర్కొన్నారు. అదే మండలంలోని జిజరాంపల్లిలో పనిచేస్తున్న స్కూల్‌ అసిస్టెంట్‌ ఉదయం 11.30 గంటలకు విధులకు  హాజరువుతున్నట్లు విచారణలో తేలిందని ఆమెను కూడా సస్పెండ్‌చేసినట్లు ఆయన తెలిపారు.

Updated Date - 2020-02-20T09:10:58+05:30 IST