ఆధార్‌తో మొబైల్‌ నంబర్‌ లింకైందా!

ABN , First Publish Date - 2022-08-20T05:46:37+05:30 IST

ఆధార్‌ కార్డుతో మొబైల్‌ నంబర్‌ లింకైందా లేదా అన్నది తెలుసుకునేందుకు మార్గం ఉంది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌(డీఓటీ) మార్గదర్శకాల ప్రకారం ఒక ఆధార్‌ కార్డుకు తొమ్మిది మొబైల్‌ నంబర్లను లింక్‌ చేసుకోవచ్చు.

ఆధార్‌తో మొబైల్‌ నంబర్‌ లింకైందా!

ఎలా చెక్‌ చేసుకోవాలంటే...


ఆధార్‌ కార్డుతో మొబైల్‌ నంబర్‌ లింకైందా లేదా అన్నది తెలుసుకునేందుకు మార్గం ఉంది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌(డీఓటీ) మార్గదర్శకాల ప్రకారం ఒక ఆధార్‌ కార్డుకు తొమ్మిది మొబైల్‌ నంబర్లను లింక్‌ చేసుకోవచ్చు. ఆధార్‌కు ఏయే నంబర్లు లింక్‌ అయ్యాయి, అసలు కాకపోవడం చెక్‌ చేసుకోవచ్చు. అందుకోసం డీఓటీ ఒక పోర్టల్‌ను క్రియేట్‌ చేసింది. ద టెలికాం అనలిటిక్స్‌ ఫర్‌ ఫ్రాడ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కన్స్యూమర్‌ ప్రొటెక్షన్‌(టాఫ్‌కాప్‌) పోర్టల్‌ - టెలికం చందాదారులకు అనుసంధానాన్ని చెక్‌ చేసుకునే వీలు కల్పిస్తోంది. యాక్టివ్‌గా లేని నంబర్లను బ్లాక్‌ చేసుకోవచ్చు. బ్యాంకుల నుంచి ప్రభుత్వ సంస్థల వరకు ఈ అనుసంధానంపై డిమాండ్‌ చేసినప్పుడు సదరు ప్రక్రియ సులువుగా ఉంటుంది. ప్రస్తుతం ఈ సదుపాయం ఏపీ, తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలకే పరిమితం. 


టాఫ్‌కాప్‌ పోర్టల్‌ https://tafcop.dgtelecom.gov.in/index.php  ని తెరవాలి.

అందులో మొబైల్‌ నంబర్ని ఎంటర్‌ చేయాలి.

రిక్వెస్ట్‌ ఓటీపీ బటన్‌ని హిట్‌ చేయాలి.

ఓటీపీని ఎంటర్‌ చేసి రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు పంపాలి. వ్యాలిడేట్‌ బటన్‌ని హిట్‌ చేయాలి. 

ఇప్పుడు టాఫ్‌కాప్‌ పోర్టల్‌లో మీ ఆధార్‌ నంబర్‌కు రిజిష్టర్‌ చేసిన నంబర్లు కనిపిస్తాయి. 

అలాగే ఏయే నంబర్లు అవసరం, మరేవి అనవసరం అన్న ఆప్షన్‌ కూడా అక్కడే కనిపిస్తుంది. కావాల్సినవి ఉంచుకోవచ్చు. అవసరం లేనివి నాట్‌ రిక్వైర్డ్‌ అని బటన్‌ నొక్కి అక్కడే వదిలించుకోవచ్చు. 

Updated Date - 2022-08-20T05:46:37+05:30 IST