వాక్సిన్‌ కావాలంటే మొబైల్‌ తప్పనిసరి: అదనపు కమిషనరు

ABN , First Publish Date - 2021-05-14T06:08:08+05:30 IST

కరోనా నియంత్రణ కోసం వాక్సిన్‌ వేయించుకోవాలంటే సదరు వ్యక్తులు ఇకపై విధిగా తమ మొబైల్‌ ఫోన్లతో వాక్సినేషన్‌ కేంద్రానికి రావలిసి ఉంటుందని నగర అదనపు కమిషనరు కే.హేమమాలినీరెడ్డి గురువారం తెలిపారు.

వాక్సిన్‌ కావాలంటే మొబైల్‌ తప్పనిసరి: అదనపు కమిషనరు

మంగళగిరి, మే 13: కరోనా నియంత్రణ కోసం వాక్సిన్‌ వేయించుకోవాలంటే సదరు వ్యక్తులు ఇకపై విధిగా తమ మొబైల్‌ ఫోన్లతో వాక్సినేషన్‌ కేంద్రానికి రావలిసి ఉంటుందని నగర అదనపు కమిషనరు కే.హేమమాలినీరెడ్డి గురువారం తెలిపారు. మొబైల్‌ఫోన్‌కు వచ్చే ఓటీపీని తెలియజేస్తేనే వారికి వాక్సిన్‌ ఇస్తారన్నారు. మొబైల్‌తో పాటు ఆధార్‌కార్డును తప్పనిసరిగా తెచ్చుకోవాలన్నారు. అలాగే మొదటి డోస్‌ వేయించుకుని కనీసం 45 రోజులు దాటినవారికి మాత్రమే రెండోడోస్‌ ఇస్తారన్నారు. మంగళగిరి పాత మునిసిపల్‌ పట్టణంలో రెండు కేంద్రాలలో వాక్సిన్‌లను వేయనున్నట్టు ఆమె చెప్పారు. 


Updated Date - 2021-05-14T06:08:08+05:30 IST