Abn logo
Feb 26 2021 @ 23:24PM

సయ్యద్‌ ఆఫ్రీన్‌కు ఎమ్మెల్సీ కవిత అభినందన

నిజామాబాద్‌ అర్బన్‌, ఫిబ్రవరి 26 : తెలంగాణ యూనివ ర్సిటీ ద్వారా అతిచిన్న వయసులో తెలుగులో డాక్టరేట్‌ అందు కున్న కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన సయ్యద్‌ ఆఫ్రీన్‌ బేగంను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ఆఫ్రీన్‌ మర్యాదపూర్వకంగా కలవగా ఆ మెను ఎమ్మెల్సీ కవిత జ్ఞాపికతో సన్మానించారు. తెలుగు భాషా సా హిత్యం, రచనలపై పరిశోధనకుగాను ఇటీవల ఆఫ్రీన్‌ డాక్టరేట్‌ సా ధించింది. ముస్లిం యువతి తెలుగు మీడియం చదవడమేకాకుండా కేవలం మూడేళ్లలో పీహెచ్‌డీ పూర్తిచేయడం ఎంతో గర్వకారణమని ఎమ్మెల్సీ కవిత అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రతినిధులు నవీనాచారి, రాజీవ్‌సాగర్‌, ప్రొఫెసర్‌ కనకయ్య ఉన్నారు. 

Advertisement
Advertisement