రైతులపై వివక్ష చూపుతున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-06-30T05:41:05+05:30 IST

కాకినాడ సిటీ, జూన్‌ 29: రైతులపై జగన్‌ ప్రభుత్వం వివక్ష చూపుతోందని, అనేక హామీలు ఇచ్చి మూడేళ్లలో అన్ని విధాలా మోసం చేసిం దని ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు విమర్శించారు. రైతు గెలవాలి.. వ్యవసాయం నిలవాలి.. అనే నినాదంతో టీడీపీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో జూలై 2న జగ్గంపేటలో నిర్వహిస్తున్న రైతు పోరు కార్యక్రమం పోస్టర్‌ను టీడీపీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మె

రైతులపై వివక్ష చూపుతున్న ప్రభుత్వం
కాకినాడలో రైతు పోరు పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న చిక్కాల, వనమాడి

ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు 

కాకినాడ సిటీ, జూన్‌ 29: రైతులపై జగన్‌ ప్రభుత్వం వివక్ష చూపుతోందని, అనేక హామీలు ఇచ్చి మూడేళ్లలో అన్ని విధాలా మోసం చేసిం దని ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు విమర్శించారు. రైతు గెలవాలి.. వ్యవసాయం నిలవాలి.. అనే నినాదంతో టీడీపీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో జూలై 2న జగ్గంపేటలో నిర్వహిస్తున్న రైతు పోరు కార్యక్రమం పోస్టర్‌ను టీడీపీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రూరల్‌ నాయకుడు పేరాబత్తుల రాజశేఖర్‌ బుధవారం ఆవిష్కరించారు. చిక్కాల మాట్లాడుతూ ప్రభుత్వం కాలువల్లో గుర్రపు డెక్కను కూడా తొలగించలేకపోయిందన్నారు. కోనసీమలో క్రాప్‌ హాలీడే ప్రకటిస్తే ప్రభుత్వంలో ఉలుకు, పలుకు లేదన్నారు. కొండబాబు మాట్లాడుతూ వైసీపీ మూడేళ్ల పాలనలో రైతులను మాయమాటలతో నమ్మించి మోసం చేసిందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, గదుల సాయిబాబు, సీతయ్యదొర, తుమ్మల రమేష్‌, వొమ్మి బాలాజీ, కాకరపల్లి చలపతి, కొల్లాబత్తుల అప్పారావు, పలివెల రవిఅనంతకుమార్‌, వాసిరెడ్డి చిట్టిబాబు, వనమాడి ధర్మారావు, జొన్నాడ వెంకటరమణ, బంగారు సత్యనారాయణ, మల్లవరం బాబి, మెంటారావు, పాలిక చిరంజీవి, అన్సర్‌, సయ్యద్‌ ఆలీ, వినాయక పాల్గొన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని 28వ డివిజన్‌లో కొండబాబు నిర్వహించారు. కార్యకర్తలు కాకి శ్రీ ను, రెడ్నం సత్తిబాబు, టేకుమూడి సుబ్రహ్మణ్యం, నాగం బాలవీర్రాజు, నెల్లి రమణ పాల్గొన్నారు. 


రైతు పోరును విజయవంతం చేయాలి

జగ్గంపేట:  రైతుపోరు సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు. రావులమ్మనగర్‌ పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన సమాశంలో ఆయన మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చే యడానికి కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాలకుర్తి శ్రీనివాసు, బొతు శివస్వామి, భతర్‌కుమార్‌, ఎస్వీఎస్‌ అప్పరాజు, మారిశెట్టి భద్రం, పాండ్రంగి రాంబాబు, మంతెన నీలాద్రిరాజు ఉన్నారు.

Updated Date - 2022-06-30T05:41:05+05:30 IST