Abn logo
Jul 26 2021 @ 23:52PM

ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట

అప్పిరెడ్డి, మేయర్‌ కావటి, ఎమ్మెల్యేలు గిరిధర్‌, నంబూరు శంకరరావులను సత్కరిస్తున్న మత పెద్దలు

ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి

గుంటూరు, జూలై 26: ముస్లింమైనార్టీల సంక్షేమానికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి పేర్కొన్నారు. పట్టాభిపురంలోని మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ షాదీఖానా కమిటీ ఆధ్వర్యంలో పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌ అధ్యక్షతన అప్పిరెడ్డిని సోమవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల అభ్యున్నతి కోసం దివంగత సీఎం వైఎస్‌ఆర్‌ రెండడుగులు ముందుకేస్తే ప్రస్తుతం సీఎం జగన్‌ నాలుగడుగులు ముందుకేసి అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. దేశంలోనే ముస్లింమైనార్టీలకు నాలుగుశాతం రిజర్వేషన్‌లు అందించిన ఘనత దివంగత సీఎం వైఎస్‌ఆర్‌కే దక్కుతుందని, ఆయన వారసుడిగా సీఎం జగన్‌ ముస్లింలకు మరింత మేలు చేసేలా పథకాలను అమలు చేస్తున్నారన్నారు. వ్యక్తిగతంగా తనకు ముస్లిం మైనార్టీలు ఎప్పుడూ అండగా నిలుస్తున్నారని, వారందరికి తాను ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు. అనంతరం నగర మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు, ఎమ్మెల్యేలు నంబూరు శంకరరావు,  మద్దాళి గిరిధర్‌, మార్కెట్‌యార్డు చైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నం ఇతర మతపెద్దలు అప్పిరెడ్డిని గజమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ అడపాశేషు, వైసీపీ నాయకులు షౌకత్‌, షాదీఖానా కమిటీ సభ్యులు రోషన్‌, గౌస్‌పీరా, ఫరియాజ్‌, బాబు, షఫీ, మార్కెట్‌బాబు, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు.