అప్పిరెడ్డి ఎట్‌ ఎమ్మెల్సీ

ABN , First Publish Date - 2021-06-14T05:30:00+05:30 IST

చట్టసభలోకి అడుగుపెట్టాలనే లేళ్ళ అప్పిరెడ్డి కోరిక ఎట్టకేలకు నెరవేరింది. ఎమ్మెల్సీగా నియమిస్తూ గవర్నర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అప్పిరెడ్డి ఎట్‌ ఎమ్మెల్సీ
లేళ్ళ అప్పిరెడ్డి

శాసనమండలికి లేళ్ల అప్పిరెడ్డి

నెరవేరిన చిరకాల వాంఛ

గవర్నర్‌ కోటాలో దక్కిన అవకాశం


గుంటూరు, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): చట్టసభలోకి అడుగుపెట్టాలనే లేళ్ళ అప్పిరెడ్డి కోరిక ఎట్టకేలకు నెరవేరింది. ఎమ్మెల్సీగా నియమిస్తూ గవర్నర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్నపుడు గుంటూరు మార్కెట్‌ యార్డు చైర్మన్‌ పదవి ఆయనను వరించింది. ఆ పదవికి వైఎస్సార్‌ వేరే పేరును సూచించగా జగన్‌.. అప్పిరెడ్డి పేరును సిఫార్సు చేయటంతో ఆ పదవిని దక్కించుకు న్నారు. తాను అధికారంలోకి రాగానే జగన్‌ ఏదో ఒక నామినేటెడ్‌ పదవి ఇవ్వాలని భావిం చినప్పటికీ అప్పిరెడ్డి తిరస్కరించారు. ఆలస్య మైనా సరే తనకు ఎమ్మెల్సీ పదవే ఇవ్వాలని అధినేతకు విన్నవించటంతో ఇప్పటికి ఆ అవ కాశం వచ్చింది. అంతకు మునుపే ఎమ్మెల్సీ పదవికి అప్పిరెడ్డి పేరు పరిశీలనలోకి వచ్చినప్పటికీ సామాజిక సమీకరణలో భాగంగా అప్పట్లో వీలుకాలేదు. ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం జాప్యం కావడంతో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, కేంద్ర పార్టీ కార్యాలయ ఇన్‌చార్జి బాధ్యతలు కూడా సీఎం జగన్‌ అప్పగించి అతనిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. గవర్నర్‌ కోటాలో శాసన మండలిలోకి అడుగుపెడుతున్న అప్పిరెడ్డి ఈ పదవిలో ఆరేళ్ళ పాటు కొనసాగనున్నారు.


విద్యార్థి దశ నుంచే...

విద్యార్థి దశ నుంచే రాజకీయాల పట్ల ఆపేక్ష పెంచుకున్న అప్పిరెడ్డి 1987 నుంచి ఎన్‌ఎస్‌యూఐలో క్రియాశీలకంగా వ్యవ హరించారు. 1989 నుంచి 94 వరకు ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడిగా, 1994 నుంచి 2001 వరకు యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 1996లో భజరంగ్‌ జూట్‌మిల్‌ వర్కర్స్‌ యూని యన్‌ కార్మిక సంక్షేమ సంఘం వ్యవస్థా పక అధ్యక్షుడిగా ఎన్నికై అప్పటినుంచి కార్మిక నేతగా కూడా పేరొందారు. అప్పి రెడ్డి చొరవతోనే కార్మికుల కుటుంబాల్లో ఆడ పిల్లల వివాహానికి రూ.25వేలు ఇవ్వటం వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 2015 నుంచి స్ఫూర్తి ఫౌండేషన్‌ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తు న్నారు. నిరుపేద విద్యార్థులకు ఉచిత కోచింగ్‌ సెంటర్ల ఏర్పాటు, ఉచితంగా ఫీజులు, పాఠ్య పుస్తకాల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీలో 2003 నుంచి కీలక పదవులు చేపడుతూ వచ్చారు. పీసీసీ కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. ఇక వైసీపీ ఆవిర్భావంతో 2011 నుంచి 2017 వరకు ఆ పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2014 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేశారు. 2018లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్య క్షుడిగా నియమితులయ్యారు. గుంటూరు రూరల్‌ మండలం అంకిరెడ్డిపాలెంలో జన్మించిన అప్పిరెడ్డి విద్యాభ్యాస మంతా గుంటూరులోనే జరిగింది. 

Updated Date - 2021-06-14T05:30:00+05:30 IST