కేసీఆర్‌ హయాంలోనే మత్స్యకారుల అభివృద్ధి

ABN , First Publish Date - 2020-09-27T10:45:45+05:30 IST

కేసీఆర్‌ హయాం లోనే రాష్ట్రంలోని మత్స్యకారుల అభివృద్ధి జరిగిందని కొత్తగూడెం శాసన సభ్యులు వనమా వెంకటేశ్వరరావు అన్నారు.

కేసీఆర్‌ హయాంలోనే మత్స్యకారుల అభివృద్ధి

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు


పాల్వంచ రూరల్‌, సెప్టెంబరు 26: కేసీఆర్‌ హయాం లోనే రాష్ట్రంలోని మత్స్యకారుల అభివృద్ధి జరిగిందని కొత్తగూడెం శాసన సభ్యులు వనమా వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం పాల్వంచ పాత ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో మండల పరిధిలోని మత్స్యకారులకు చేప పి ల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన వనమా ముందుగా లబ్ధిదారు లైన 15 చెరువులకు సంబంధించిన మత్స్యకారులకు 3.40లక్షల చేప పిల్లలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.... కొత్తగూడెం నియోజకవర్గంలో 19 లక్షల చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామన్నారు. మత్స్యకారులు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను స ద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్ర మంలో జిల్లా మత్స్యశాఖ అధికారి వరదారెడ్డి, తహసీల్దార్‌ భగవాన్‌రెడ్డి, ఎంపీడీవో ఆల్బర్ట్‌, డీసీఎంఎస్‌ ఉపాధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు, జడ్పీటీసీ బరపాటి వాసుదేవరావు, సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్‌, ఎంపీటీసీ మద్దుల వీరమోహన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-27T10:45:45+05:30 IST