పొంగులేటితో యుద్ధానికి సిద్ధం... నేనేంటో చూపిస్తా?: ఎమ్మెల్యే రేగా సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-02-26T19:09:46+05:30 IST

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డిపై టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రేగా కాంతారావు ఫేస్‌బుక్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

పొంగులేటితో యుద్ధానికి సిద్ధం... నేనేంటో చూపిస్తా?: ఎమ్మెల్యే రేగా సంచలన వ్యాఖ్యలు

భద్రాద్రి కొత్తగూడెం: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డిపై టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రేగా కాంతారావు ఫేస్‌బుక్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.  ‘‘పినపాకలో పొంగులేటికి పనేంటి?... అంబేద్కర్ సాక్షిగా దళితులు, వెనుకబడిన వర్గాలపై యుద్ధానికి పొంగులేటి వచ్చారా?... పొంగులేటి పినపాకపై యుద్ధానికి వస్తే నేను సిద్ధంగా ఉంటా?.. నేను పారిపోయే రకం కాదు.. భవిష్యత్‌లో నేనేంటో చూపిస్తా?.. టీఆర్ఎస్ కార్యకర్తలు గాజులు వేసుకోలేదు, ఏ ఒక్క కార్యకర్త జోలికి వచ్చినా ఊరుకునేది లేదు.. మండల నాయకులకు సమాచారం లేకుండా విగ్రహ ఆవిష్కరణ ఎలా చేస్తారు’’ అంటూ ఫేస్‌బుక్‌లో ఎమ్మెల్యే రేగా  పోస్టులు పెట్టారు. ప్రస్తుతం రేగా కాంతారావు వ్యాఖ్యలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. 

Updated Date - 2022-02-26T19:09:46+05:30 IST