‘సీతారామ’తో తీరనున్న కష్టాలు

ABN , First Publish Date - 2021-10-20T05:01:49+05:30 IST

సీతారామ కాలువ నిర్మా ణంతో మండలంలోని పలు గ్రామాలలోని రైతుల కష్టాలు తీరనున్నాయని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ అన్నారు.

‘సీతారామ’తో తీరనున్న కష్టాలు
చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే రాములు నాయక్‌

వైరా ఎమ్మెల్యే రాములు నాయక్‌

జూలూరుపాడు, అక్టోబరు 19: సీతారామ కాలువ నిర్మా ణంతో మండలంలోని పలు గ్రామాలలోని రైతుల కష్టాలు తీరనున్నాయని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ అన్నారు. మండలంలోని ఏడుగురు లబ్దిదారులకు ప్రభుత్వం సీఎం రిలీఫండ్‌ కింద రూ.2.89 లక్షల విలువ చేసే చెక్కులను మంజూరి చేసింది. మంగళవారం జూలూ రుపాడులోని తన క్యాంపు కార్యాలయంలో లబ్దిదారులకు ఎమ్మెల్యే వాటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మండ లంలోని కొన్ని గ్రామాల రైతులు సాగు నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారని, వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సీతారామ కాలవ నిర్మాణం చేపట్టిందన్నారు. త్వరలోనే నిర్మాణ పనులను పూర్తి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణ బిడ్డ లందరికి సంక్షేమ పథకాలను అందిస్తుందన్నారు. టీఆర్‌ ఎస్‌ పాలనలో గ్రామాలు ఎంతగానో అభివృద్ది చెందాయని, మరో రెండున్నర సంవత్సరాలలో ఎన్నో అభివృద్ది కార్యక్ర మాలను చేపట్టాలని సీఎం కేసీఆర్‌ కృత నిశ్చయంతో ఉన్న ట్లు తెలిపారు. సర్పంచ్‌లే పంచాయతీలకు పట్టుకొమ్మలని, ప్రజా సేవలో ముందు ఉండాలని సూచించారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయవద్దు అని, ప్రజా సేవలో రాజీ ప డకుండా ఉండాలని తెలిపారు. కలిసి మెలిసి పని చే యాలని కోరారు. ప్రజలు సంక్లిష్ట సమయంలో నన్ను ఆద రించి ఎమ్మెల్యేగా గెలిపించారని, వారి రుణం తీర్చుకుం టా నని, ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా కృషి చేస్తా నని తెలిపారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్‌ లేళ్ల వెంకటరెడ్డి, ఎంపీపీ లావుడ్యా సోనీ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చౌడం నరసింహారావు, ఎంపిటీసీ బాణోత్‌ నీల, రైతు బంధు మండల కన్వీనర్‌ ఎదళ్ళపల్లి వీరభద్రం, జిల్లా సభ్యులు వేల్పుల నరసింహారావు, వివిధ పంచాయతీల సర్పంచ్‌లు, టీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-20T05:01:49+05:30 IST