Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీఆర్‌ఎ్‌సది నియంతపాలన

  • నేలకొరిగిన తెలంగాణ బిడ్డల త్యాగం వృథాగా మారింది 
  • హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ 

ఆధిభట్ల: పోరాడి సాధించుకున్న తెలంగాణలో నేడు టీఆర్‌ఎస్‌ నియంతపాలన చేస్తోందని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. బీజేపీ రంగారెడ్డి అర్బన్‌ జిల్లా శిక్షణ తరగతులు శనివారం ఆదిభట్ల పరిధి బొంగ్లూరు కళ్లెం జంగారెడ్డి గార్డెన్‌లో ప్రారంభమయ్యాయి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో మూడు రోజులు జరిగే ఈ కార్యక్రమంలో మొదటి రోజు ఈటల రాజేందర్‌, మాజీ ఎమ్మెల్సీ రాం చంద్రారావు, రాష్ట్ర కార్యదర్శి ప్రకా్‌షరెడ్డి పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ‘సమకాలిన రాజకీయాలు-మన బాధ్యత’ అనే అంశంపై ఈటల మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో జై తెలంగాణను రణ నినాదంగా మార్చి, నిప్పును కౌగిలించుకొని ఆత్మబలిదానం చేసిన యువకుల త్యాగఫలమే నేడు స్వయంపాలిత తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ నియంతపాలన చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. షహీద్‌ భగత్‌సింగ్‌ వంటి యోధులను స్ఫూర్తిగా తీసుకొని మృత్యువును ముద్దాడి సాధించుకున్న తెలంగాణ, నేడు దొర అహంకారంతో గడీల పాలనతో అల్లాడుతోందన్నారు. సబ్బండ వర్ణాల పోరాటంతో సాధించుకున్న రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ వ్యవస్థలు నాశనమై నియంతృత్వపాలన సాగుతోందన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడుకోకుంటే భవష్యత్‌ తరాలకు తీరని నష్టం వాటిల్లుతుందని అన్నారు. రాజకీయాల్లో నీతి, నిజాయుతీ, నిబద్ధత, జవాబుదారితనం ముఖ్యమని, అవి కేసీఆర్‌ పాలనలో మచ్చుకైనా కనిపించడం లేదన్నారు. ప్రజలతిరుగుబాటు బావూటా దూరంలో లేదన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ రాంచంద్రారావు, బీజేపీ పార్టీ చరిత్ర వికాసం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకా్‌షరెడ్డి విదేశీనీతి మన విజయాలు అనే అంశాలపై ప్రసంగిస్తూ దిశానిర్దేశం చేశారు. శిక్షణ తరగతుల కోఆర్డినేటర్‌ వన్‌పల్లి శ్రీనివా్‌సరెడ్డి, అర్బన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీధర్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, గోవర్దన్‌గౌడ్‌, మీడియా ఇన్‌చార్జి ఆనంద్‌కుమార్‌, కార్పోరేటర్లు, ముఖ్యకార్యకర్తలు పాలొన్నారు.

Advertisement
Advertisement