వెంగమాంబకు ఎమ్మెల్యే మేకపాటి పూజలు

ABN , First Publish Date - 2022-06-24T04:02:43+05:30 IST

దుత్తలూరు మండలం నర్రవాడ వెంగమాంబ ఉత్సవాల్లో గురువారం ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిం

వెంగమాంబకు ఎమ్మెల్యే మేకపాటి పూజలు
వెంగమాంబను దర్శించుకుంటున్న ఎమ్మెల్యే మేకపాటి

ఉదయగిరి, జూన్‌ 23: దుత్తలూరు మండలం నర్రవాడ వెంగమాంబ ఉత్సవాల్లో గురువారం ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో వర్థిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ధర్మకర్త కరుణాకర్‌బాబు, కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి నైవేధ్యాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రచార కార్యదర్శి శాంతకుమారి, ఉదయగిరి మండల వైసీపీ కన్వీనర్‌ అక్కి భాస్కర్‌రెడ్డి, కామేపల్లి వెంకటరత్నం, గోగుల వెంగళరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-24T04:02:43+05:30 IST