డ్‌జోన్‌లో సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2020-07-10T11:19:44+05:30 IST

రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో సౌక ర్యాల కల్పనలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఎమ్మె ల్యే డాక్టర్‌ నిమ్మల రామా నాయుడు ఆరోపించారు.

డ్‌జోన్‌లో సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం

ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు 


పాలకొల్లు టౌన్‌, జూలై 9 : రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో సౌక ర్యాల కల్పనలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఎమ్మె ల్యే డాక్టర్‌ నిమ్మల రామా నాయుడు ఆరోపించారు. 19వ వార్డులో మాజీ కౌన్సిల్‌ వెంకన్న, పద్మావతి దంప తులు గురువారం  నిరసన దీక్ష చేపట్టారు. ఎమ్మెల్యే నిమ్మల వారికి మద్దతు తెలిపేందుకు వచ్చి విలేకర్లతో మాట్లాడుతూ 19వ వార్డులో కొవిడ్‌ -19 బాధితులు 19 మంది ఉన్నప్పటికీ వార్డులో సూపర్‌ శానిటేషన్‌ చేపట్ట లేదని, తాగునీరు, కూరగాయలు, నిత్యావసర వస్తువులను అందజేయడం లోనూ నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు.


మాజీ కౌన్సిల్‌ సభ్యుడు వెంకన్న మాట్లాడుతూ తాను వారం రోజుల నుంచీ మునిసిపల్‌ అధికారులకు విన్నవిస్తున్నా శానిటేషన్‌ చేపట్టలేదని, ఎన్ని పాజిటివ్‌ కేసులు వచ్చాయి, ఎంత మందికి పరీక్షలు నిర్వహించారనే విషయంలోనూ సమాచారం లేదన్నారు.  కమిషనర్‌ ప్రమోద్‌కుమార్‌ను వివరాలు అడగ్గా కమిషనర్‌  దురుసుగా సమాధానం ఇచ్చారన్నారు. అదేవార్డులో ఒక వ్యక్తికి ఆరోగ్యం సరిగా లేదని చెబితే వెళ్లి పరీక్షలు చేయలేదని, బుధవారం ఆ వ్యక్తి పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో 108లో ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే మృతి చెందా డన్నారు.

Updated Date - 2020-07-10T11:19:44+05:30 IST