Abn logo
Jul 9 2020 @ 05:13AM

రైతుల అభ్యున్నతే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

 మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు


  దండేపల్లి, జూలై 8: రైతు అభ్యున్నతే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. బుధవారం దండేపల్లి మండలం చెల్కగూడెం, నెల్కివెంకటాపూర్‌, కోత్త మామిడిపల్లి గ్రామాల్లోని రైతు కల్లాల నిర్మా ణాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రైతులు పండించిన వరిధాన్యాన్ని అరబెట్టుకునే విధంగా సీఎం కేసిఆర్‌ వరి కల్లాల నిర్మాణాలకు  ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్‌, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్‌ గురువయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరయ్య, సహకార సంఘం ఛైర్మన్‌ లింగన్న, సర్పంచులు తిరుపతి, రాజయ్య, ఎంపీటీసీలు మౌనిక, మౌళిక, శిరీషా, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌, ఏవో అంజిత్‌కుమార్‌, ఏపీవో దుర్గదాస్‌ పాల్గొన్నారు.    

Advertisement
Advertisement