చర్చిలో ఎమ్మెల్యే మేకపాటి ప్రత్యేక ప్రార్థనలు

ABN , First Publish Date - 2022-06-27T01:46:59+05:30 IST

స్థానిక ఏబీపీ బాప్టిస్టు చర్చిలో ఆదివారం ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

చర్చిలో ఎమ్మెల్యే మేకపాటి ప్రత్యేక ప్రార్థనలు
ఉదయగిరి బాప్టిస్టు చర్చిలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మేకపాటి

ఉదయగిరి, జూన్‌ 26: స్థానిక ఏబీపీ బాప్టిస్టు చర్చిలో ఆదివారం ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి తమ ఆశీస్సులు అందించాలని కోరారు. త్వరలో జరగన్ను చర్చి 137వ వార్షికోత్సవంలో పాల్గొంటానని హామీ ఇచ్చారు. అనంతరం సంఘకాపరి సుధీర్‌కుమార్‌ ఎమ్మెల్యేకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ప్రసాదరావు, కార్యదర్శి బకీరు జాషువా, కోశాధికారి శ్రావణ్‌కుమార్‌, సభ్యులు రాబర్ట్‌ప్రభాకర్‌, ఏసుదాసు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-27T01:46:59+05:30 IST