అంగన్‌వాడీ ఆయా పోస్టును అమ్ముకున్నారు

ABN , First Publish Date - 2022-05-22T06:43:02+05:30 IST

‘పార్టీ కోసం కష్టించి పనిచేశాం...అంగన్‌వాడీ ఆయా పోస్టును ఇప్పించమని బతిమాలాం..సొమ్ములిస్తేనే పోస్టును ఇస్తామని వైసీపీ నేతలు చెప్పారు.

అంగన్‌వాడీ ఆయా పోస్టును అమ్ముకున్నారు

 ఎమ్మెల్యేకు తెలియకుండానే పోస్టులు అమ్ముకుంటారా?
  ఎమ్మెల్యే చిట్టిబాబును నిలదీసిన మహిళ
  రోడ్ల అధ్వానంపై  నిరసన సెగలు

అంబాజీపేట, మే 21: ‘పార్టీ కోసం కష్టించి పనిచేశాం...అంగన్‌వాడీ ఆయా పోస్టును ఇప్పించమని బతిమాలాం..సొమ్ములిస్తేనే పోస్టును ఇస్తామని వైసీపీ నేతలు చెప్పారు. పార్టీకి పనిచేసిన వారికే ఈ గతేంటి..?’ అని ఓ మహిళా వైసీపీ కార్యకర్త పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబును నిలదీసింది. గడగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శనివారం అం బాజీపేట మండలం చిరతపూడిలో  ఎమ్మెల్యే పర్య టించారు. ఈ సందర్భంగా మహిళా కార్యకర్త దాసరి భార్గవి స్థానిక వైసీపీ నేతల బండారన్ని బయటపెట్టింది. గ్రామంలో చేస్తున్న అరాచకాలను ఎమ్మెల్యే ముం దుంచింది. తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నా రని,  అంగన్‌వాడీ ఆయా పోస్టును ఇప్పి ంచాలని స్థానిక నేతలు దగ్గరకి వెళితే సొమ్ములు ఇస్తేనే ఆయా పోస్టును మం జూరు చేస్తున్నామని చెప్పారని ఎమ్మెల్యేకు వివరించింది. ఎమ్మెల్యేకు తెలియకుండా పోస్టులు అమ్ముకుంటారా అని ఆమె ప్రశ్నించింది. ఆమె ప్రశ్నకు ఏమి చెప్పాలో ఎమ్మెల్యేకు పాలుపోలేదు. ఆయా పోస్టుకు తనకు అర్హత ఉన్నప్పటికి రాజకీయ ఒత్తిళ్ళు, సొమ్ములకు కక్కుర్తి పడి తనకు పోస్టును ఇవ్వకుండా నేతలు అడ్డుపడ్డారని మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అధ్వానంగా ఉన్న రహదారుల పరిస్థితి ఏంటని ఎమ్మెల్యేను గ్రామస్థులు నిలదీశారు. స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో  జిల్లా అధికారుల వద్దకు వెళ్ళి సమస్యలను విన్నవించుకుంటున్నామని ఎమ్మెల్యేకు వివరించారు.  దీంతో ఎమ్మెల్యే అక్కడ నుంచి వెళ్ళిపోవడంతో సమస్యలు చెబు తుంటే వెళ్ళిపోవడం దారుణమని ప్రజాప్రతినిధులకు సహనం, ఓర్పు ఉండాలని హితవు పలికారు. అనంతరం ఇం టింటికి తిరిగిన ఎమ్మెల్యేకు నిరసన సెగలు తప్పలేదు. గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు తనకు ఇళ్ళు కట్టించి ఇవ్వాలని కోరడంతో ఎమ్మెల్యే కరోనా నుంచి తప్పించుకున్నావు చాలదా అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడ ఉన్న యువకులు ఎమ్మెల్యేపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు,  వైస్‌ ఎంపీపీ నేతల నాగరాజు, వైసీపీ మండల శాఖ అధ్యక్షుడు వాసంశెట్టి, కార్యదర్శి నాగవరపు నాగరాజు, మాజీ ఏఎంసీ చైర్మన్‌ వాసంశెట్టి వరలక్ష్మి, స్ధానికులు లూటుకుర్తి శ్రీనివాస్‌, కడలి సత్యనారాయణ తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.

Updated Date - 2022-05-22T06:43:02+05:30 IST