Advertisement
Advertisement
Abn logo
Advertisement

లోకేష్‌కు దళితుల గురించి ఏమీ తెలియదు: వైసీపీ ఎమ్మెల్యే

విశాఖ: బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకు గురికావడం దళిత సమాజం తీవ్ర దిగ్భ్రాంతికి గురయిందని పాయకరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ  టీడీపీ నేత నారా లోకేష్‌కు దళితుల గురించి ఏమీ తెలియదని అన్నారు. ఆయనకు దళితులపై ప్రేమ ఉంటే, రమ్య కుటుంబానికి ఏ విధంగా సహాయం చేయాలో ఆలోచించాలన్నారు. మరో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ రమ్య హత్య ఘటన రాజకీయం చేయోద్దన్నారు. చంద్రబాబు ప్రతి విషయాన్ని  హైజాక్  చేయడంలో దిట్టన్నారు. నిందితుడిని పోలీసులు గంటల వ్యవధిలోనే పట్టుకున్నారని, త్వరలో లోకేష్‌కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.

Advertisement
Advertisement