అభివృద్ధి, సంక్షేమ పథకాలే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2020-10-30T11:28:08+05:30 IST

అభివృద్ధి, సంక్షేమ పథకాలే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్య మని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.

అభివృద్ధి, సంక్షేమ పథకాలే ప్రభుత్వ లక్ష్యం

కేతేపల్లి, అక్టోబరు 29: అభివృద్ధి, సంక్షేమ పథకాలే  రాష్ట్ర ప్రభుత్వ లక్ష్య మని   ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం కేతేపల్లి మండలంలోని కొత్తపేట గ్రామంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని, వైకుంఠధామ నిర్మాణాన్ని ప్రారంభించి మాట్లా డారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసు కువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌లు బి.జానకిరాములు, కోట వెంకటేశ్వరరావు, కట్టా శ్రవణ్‌, ఎంపీ టీసీ బుర్రి యాదవరెడ్డి, ఎంపీపీ శేఖర్‌, జడ్పీటీసీ స్వర్ణలత, కె.సైదిరెడ్డి,  డి. సునీత,  బి.వెకటరెడ్డి,  ఎంపీడీవో వై.హరికృష్ణ, ఏపీవో కె.రామ్మోహన్‌, పీఏ సీఎస్‌ డైరెక్టర్లు కొప్పుల ప్రదీప్‌రెడ్డి, చింతం వెంకటేశ్వర్లు, వి.ఇజాక్‌, సీఈవో వి.నర్సయ్య, నాయకులు కొండ సైదులు, చల్లా కృష్ణారెడ్డి, రాజు, ఆర్‌.సైదులు తదితరులు పాల్గొన్నారు.


మాడ్గులపల్లి: మండలంలోని బొమ్మకల్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు మహ్మద్‌ మోసిన్‌అలీ ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పుల్లెంల సైదులు షేక్‌ మౌలాలి, సర్పంచ్‌ మారుతి వెంకట్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ నక్కా శేఖర్‌, వైస్‌ చైర్మన్‌, పెదపంగ సైదులు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పాలుట్ల బాబయ్య, నాయకులు సూదిరెడ్డి శ్రీనివా్‌సరెడ్డి, పోకల రాజు పాల్గొన్నారు. 


కట్టంగూరు: మండలంలోని ముత్యాలమ్మగూడెంలో పీఏసీఎస్‌ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జడ్పీటీసీ తరాల బలరాం ప్రారంభించారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ నూకసైదులు, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు, పులకరం లింగస్వామి, రేకల భిక్షం, శ్రీను, సత్యనారాయణచారి పాల్గొన్నారు. 


శాలిగౌరారం: మండలంలోని చిత్తలూరు గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జడ్పీటీసీ ఎర్ర రమీల యాదగిరి, సర్పంచ్‌ మామిడికాయల జయమ్మతో కలిసి ప్రారంభించారు. బైరవునిబండ, రామాంజపురం, గురుజాల, మనిమద్దె గ్రామల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు  కేంద్రాలను ఆయా సర్పంచ్‌లు దండ రేణుకఅశోక్‌రెడ్డి, జఠంగి శంకర్‌, గుండా శ్రీనివాస్‌, కలమ్మలు ప్రారంభించారు. చిత్తలూరులో నిర్వహించిన కార్యక్రమంలో  ఎంపీ టీసీ దాసరి ప్రమీల, నాయకులు  పాల్గొన్నారు.


ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తేవాలి: నోముల

మాడ్గులపల్లి:  ఆరబెట్టిన ధాన్యాన్ని  రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రా లకు తెచ్చి మద్దతు ధర పొందాలని నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అన్నారు.  మాడ్గులపల్లి మండలంలోని కన్నెకల్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కామెర్ల జానయ్య తో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు పం డించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. కార్యర కమంలో  జడ్పీటీసీ పుల్లెంల సైదులు, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ విరిగినేని అంజ య్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-30T11:28:08+05:30 IST