గుంటూరు: రేపల్లె రైల్వేస్టేషన్లో అత్యాచార ఘటన చాలా దారుణమని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జగన్‌రెడ్డి పాలనలో ఏపీ బీహార్‌గా మారిందన్నారు. ఏపీలో రోజుకో అత్యాచారం, పూటకో హత్య జరుగుతోందన్నారు. ఏపీలో మహిళలకు రక్షణకరువైందని, జగన్ ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకే పరిమితమైందని ఎమ్మెల్యే విమర్శించారు.
రాష్ట్రంలో ప్రతి రోజు మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే అనగాని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలకు కారకులైన వారిపై ప్రభుత్వం కఠింనంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని డ్రగ్స్, గంజాయి, పేకాట హబ్‌లుగా మార్చి.. న్యాయం కోరిన బాధితులపై లాఠీచార్జ్ చేయడం వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. పేద మహిళలకు న్యాయం జరిగేంతవరకు టీడీపీ పోరాడుతుందని, అత్యాచార, హత్యాయత్నాలకు పాల్పడుతున్న దుర్మార్గులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకునేంత వరకు రేపల్లెలో ప్రతి టీడీపీ కార్యకర్తతో కలిసి రోడ్డెక్కి పోరాటం చేస్తామని ఎమ్మెల్యే అనగాని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి