సినిమా పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆత్రం సక్కు
ABN , First Publish Date - 2022-01-20T04:31:52+05:30 IST
జిల్లాలోని కెరమెరి మండలం అనార్‌పల్లి గ్రామానికి చెందిన లక్కీరాథోడ్ హీరోగా నటించిన ‘ఆంట్’ సినిమా పోస్టర్లను బుధ వారం ఎమ్మెల్యే ఆత్రంసక్కు ఆవిష్కరించారు.
ఆసిఫాబాద్, జనవరి 19: జిల్లాలోని కెరమెరి మండలం అనార్‌పల్లి గ్రామానికి చెందిన లక్కీరాథోడ్ హీరోగా నటించిన ‘ఆంట్’ సినిమా పోస్టర్లను బుధ వారం ఎమ్మెల్యే ఆత్రంసక్కు ఆవిష్కరించారు. పట్టణం లోని ఎమ్మెల్యేక్యాంపు కార్యాలయంలో పోస్టర్లను ఆవి ష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాకు చెందిన నటీనటులను ప్రోత్సహించాలన్నారు. హీరో యిన్ రింకల్ రేన, ఆత్రంసక్కు యూత్‌ఫోర్స్ అధ్య క్షుడు వినోద్‌కుమార్, చిత్ర నటీనటులు పాల్గొన్నారు.
విద్యార్థికి ఆర్థిక సాయం అందజేత
ఆసిఫాబాద్ మండలంలోని ఈదులవాడ గ్రామానికి చెందిన విద్యార్థిని తన్నీరు అనూషకు ఎమ్మెల్యే ఆత్రం సక్కు బుధవారం రూ.30వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనూష ఎంఎస్సీ హార్టికల్చర్ ఎంట్రెన్స్‌లో 20వర్యాంకు సాధించగా తల్లిదండ్రులు చదివించే స్థోమత లేకపోవడంతో ఎమ్మెల్యేను సంపద్రించింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే కుమరంభీం స్టడీసర్కిల్ ద్వారా రూ.30 ఆర్థిక సహాయం అందజేశారు. దీంతో అనూష ఈనెల 21న జరిగే కౌన్సెలింగ్‌కు హాజరు కానున్నది. స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఊశన్న, రాజశేఖర్ పాల్గొన్నారు.