కోవిషీల్డ్, కోవాగ్జిన్ మిక్స్‌డ్ డోస్‌తో మరింత రక్షణ: ఐసీఎంఆర్

ABN , First Publish Date - 2021-08-08T17:43:30+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌కు అడ్డుకట్టవేసేందుకు...

కోవిషీల్డ్, కోవాగ్జిన్ మిక్స్‌డ్ డోస్‌తో మరింత రక్షణ: ఐసీఎంఆర్

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌కు అడ్డుకట్టవేసేందుకు వ్యాక్సీన్ ఒక్కటే మార్గమని నిపుణులు చెబుతున్నారు. అయితే కరోనా వ్యాక్సిన్ ప్రభావంపై ఇప్పటికీ పరిశోధనలు కొనసాగుతున్నాయి. కరోనా వ్యాక్సినేషన్‌లో మిక్స్ డ్ డోస్‌పై అధ్యయనం చేస్తున్న ఇండియన్ కౌన్సిల్ ఆప్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) పరిశోధకులు మరో కొత్త విషయాన్ని వెల్లడించారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ల మిక్స్‌డ్ డోస్‌తో ఉత్తమ ఫలితాలు కనిపించాయని తెలిపారు. ఎడినోవైరస్ వెక్టర్ ప్లాట్‌ఫారం ఆధారంగా ఈ రెండు వ్యాక్సీన్లను కలపడం ద్వారా వైరస్ నుంచి మరింత రక్షణ లభిస్తుందని వెల్లడయ్యింది. అలాగే ఇలా మిక్స్‌డ్ డోసు తీసుకోవడం వలన శరీరంలో ఇమ్యూనిటీ మరింతగా వృద్ధి చెందుతుందని తేలింది.

Updated Date - 2021-08-08T17:43:30+05:30 IST