సందడిగా ‘మిస్టర్, మిస్, మిసెస్ హైదరాబాద్’

ABN , First Publish Date - 2020-10-12T23:04:47+05:30 IST

నగరానికి చెందిన ప్రముఖ మేగజైన్ సిటీ లైఫ్ నిర్వహించిన ‘మిస్టర్, మిస్, మిసెస్ హైదరాబాద్’ సందడిగా సాగింది. మోడల్స్‌ను ప్రోత్సహిస్తూ సిటీ లైఫ్ చైర్మన్ మాక్ తారిక్ ఈ కార్యక్రమాన్ని ఏటా నిర్వహిస్తున్నారు.

సందడిగా ‘మిస్టర్, మిస్, మిసెస్ హైదరాబాద్’

హైదరాబాద్: నగరానికి చెందిన ప్రముఖ మేగజైన్ సిటీ లైఫ్ నిర్వహించిన ‘మిస్టర్, మిస్, మిసెస్ హైదరాబాద్’ సందడిగా సాగింది. మోడల్స్‌ను ప్రోత్సహిస్తూ సిటీ లైఫ్ చైర్మన్ మాక్ తారిక్ ఈ కార్యక్రమాన్ని ఏటా నిర్వహిస్తున్నారు. నగరంలోని లే మెరీడియన్ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి ట్వింకిల్ కపూర్ ముఖ్య అతిథిగా విచ్చేయగా, ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న ప్రముఖ మోడల్స్ సుధా జైన్, డాక్టర్ కల్పన, కృతిక శర్మ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ మోడల్ హంట్‌లో, మిస్ హైదరాబాద్‌గా రమ్య రాజ్ పూత్, మిస్టర్ హైదరాబాద్‌గా సోహెల్, మిసెస్ హైదరాబాద్‌గా రాఘవి విజేతలుగా నిలిచారు. విజేతలకు, నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు, సినీ దర్శకులు, సామాజిక కార్యకర్త డాక్టర్ ఆనంద్ పాల్గొన్నారు. వీజే రాఖి, ప్రియాంక శర్మ వ్యాఖ్యానం అందరినీ ఆకట్టుకుంది.

Updated Date - 2020-10-12T23:04:47+05:30 IST