మిషన్‌ భగీరథ నీరు అందించాలి

ABN , First Publish Date - 2021-04-13T05:57:26+05:30 IST

జిల్లాలోని అన్ని గ్రామాల ప్రజలకు మిషన్‌ భగీరథ నీరు అందేలా చూడాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ అన్నారు. సోమవారం కలెక్టర్‌ సమావేశ మందిరంలో మిషన్‌ భగీరథ, పంచాయ తీరాజ్‌ శాఖలపై సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

మిషన్‌ భగీరథ నీరు అందించాలి

ఆదిలాబాద్‌టౌన్‌, ఏప్రిల్‌ 12: జిల్లాలోని అన్ని గ్రామాల ప్రజలకు మిషన్‌ భగీరథ నీరు అందేలా చూడాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ అన్నారు. సోమవారం కలెక్టర్‌ సమావేశ మందిరంలో మిషన్‌ భగీరథ, పంచాయ తీరాజ్‌ శాఖలపై సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1231 హాబిటేషన్లకు గాను 1227 హాబిటేషన్లు మిషన్‌ భగీరథ ద్వారా, నాలుగు హాబిటేషన్లకు సోలార్‌ సిస్టమ్‌ ద్వారా నీటి సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. మిషన్‌ భగీరథకు సంబంధించిన వివరాలు ఆయా ఎంపీ డీవోలకు, స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియజేయాలని సూచించారు. జిల్లాలో 73 రైతు వేదికలకు మిషన్‌ భగీరథ కనెక్షన్‌ ఇవ్వడం జరిగిందని, మిగతా పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. కాగా, మిషన్‌ భగీరథ ఇంజనీరింగ్‌, పంచాయతీరాజ్‌ శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని, 45 ఏళ్లు నిండిన వారు వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డీపీవో శ్రీనివాస్‌, పంచాయతీరాజ్‌ ఈఈ మహావీర్‌, డిప్యూటీ ఈఈలు, ఇంజనీరింగ్‌ సిబ్బంది తదితరులున్నారు.

Updated Date - 2021-04-13T05:57:26+05:30 IST