బ్యూటీ క్వీన్‌కు దారుణ పరాజయం

ABN , First Publish Date - 2022-03-11T20:49:13+05:30 IST

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నామమాత్రపు ప్రభావం కూడా చూపలేకపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ మాజీ బ్యూటీ క్వీన్ కాంగ్రెస్ తరఫున పోటీచేసి దారుణమైన ఓట్లు దక్కించుకుంది.

బ్యూటీ క్వీన్‌కు దారుణ పరాజయం

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నామమాత్రపు ప్రభావం కూడా చూపలేకపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ మాజీ బ్యూటీ క్వీన్ కాంగ్రెస్ తరఫున పోటీచేసి దారుణమైన ఓట్లు దక్కించుకుంది. 2018లో మిస్ బికినీ యూనివర్స్ ఇండియాగా నిలిచిన అర్చనా గౌతమ్, తాజా ఎన్నికల్లో యూపీలోని హస్తినాపూర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసింది. అయితే, ఆమెకు 1,519 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇక్కడ బీజేపీ, ఎస్పీ అభ్యర్థులకు అర్చన కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. బీజేపీ అభ్యర్థికి 1,07,587 ఓట్లురాగా, ఎస్పీ అభ్యర్థికి 1,00,275 ఓట్లు వచ్చాయి. వాళ్లిద్దరితో పోలిస్తే అర్చనకు ఒక్క శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. అయితే, తనకు ఈ ఎన్నికల్లో ఓట్లు వేసిన ప్రజలకు అర్చన థాంక్స్ చెప్పడం విశేషం.

Updated Date - 2022-03-11T20:49:13+05:30 IST