దారి తప్పిన బాల్యం

ABN , First Publish Date - 2021-04-16T04:30:29+05:30 IST

అక్షరాలు దిద్దాల్సిన చిన్నారులు పరిస్థితులు ఏమైనా వారి మార్గం మారి బాల్యం దారి తప్పింది. బడికి వెళ్లాల్సిన వారు పనులకు, చెత్తను ఏరుకుంటూ, భిక్షాటన చేస్తూ వీధుల వెంట తిరుగుతున్నారు.

దారి తప్పిన బాల్యం

పులివెందుల రూరల్‌, ఏప్రిల్‌ 15: అక్షరాలు దిద్దాల్సిన చిన్నారులు పరిస్థితులు ఏమైనా వారి మార్గం మారి బాల్యం దారి తప్పింది. బడికి వెళ్లాల్సిన వారు పనులకు, చెత్తను ఏరుకుంటూ, భిక్షాటన చేస్తూ వీధుల వెంట తిరుగుతున్నారు. బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలని నిర్భంద విద్యా హక్కు చట్టం అమలు చేస్తున్నా వీరికి అది ఉపయోగ పడ డంలేదు.

ఏటా బడి బయట ఉన్న చిన్నారు ల జాబితాను అధికారులు తయారు చేస్తూనే ఉన్నారు. అయితే తల్లిదండ్రుల్లో మార్పు రా వడం లేదనేది స్పష్టమవుతోంది. పట్టణంలో ఎందరో చిన్నారులు బడికి దూరంగా ఉంటు న్నారు. వీధుల వెంట అడుక్కుంటూ, ఇనుప ముక్కలు, సీసాలు, ప్లాస్టిక్‌ బాటిల్లు, కవర్లు ఏరుకుంటూ కనిపిస్తుంటారు. ఇలాంటి చిన్నా రుల భవితవ్యంపై అధికారుల చర్యలు శూ న్యమనే చెప్పాలి.

విద్యాశాఖ అధికారులు ఇలాంటి చిన్నారులను గుర్తించి వారి తల్లిదం డ్రుల్లో మార్పు తీసుకొచ్చి ప్రభుత్వం చిన్నారు లకు కల్పిస్తున్న సౌకర్యాలను వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

 ఈ విషయంపై పులివెందుల విద్యాశాఖ అధికారి వీరారెడ్డి వివరణ ఇస్తూ ఇప్పటి వర కు 58 మంది చిన్నారులను గుర్తించి పాఠశా లలో చేర్పించాము. అయితే కొందరు చిన్నా రులు పాఠశాల విడిచిన తర్వాత, శని, ఆది వారాల్లో భిక్షాటనకు వెళ్తున్నారని మా దృష్టికి వచ్చింది. అలాంటి చిన్నారుల తల్లిదండ్రుల కు కౌన్సిలింగ్‌ ఇచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాము.

Updated Date - 2021-04-16T04:30:29+05:30 IST