ఘనంగా సిల్వర్‌ గర్ల్ మీరాబాయి చానూ బర్త్ డే సెలబ్రేషన్స్!

ABN , First Publish Date - 2021-08-09T17:21:30+05:30 IST

టోక్యో ఒలింపిక్స్‌ తొలిరోజునే వెయిట్ లిఫ్టింగ్‌లో...

ఘనంగా సిల్వర్‌ గర్ల్ మీరాబాయి చానూ బర్త్ డే సెలబ్రేషన్స్!

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌ తొలిరోజునే వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్ కు సిల్వర్ మెడల్‌ను అందించిన మీరాబాయి చానూ ఆదివారం కుటుంబ సభ్యుల మధ్య తన పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు. 



గడచిన ఐదేళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటున్న చానూకు ఈ బర్త్‌డే ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. ఒలింపిక్ పతకం సాధించిన అనంతరం చేసుకుంటున్న ఈ పుట్టిన రోజు వేడుకలు తనకు ఎంతో ప్రత్యేకమని మీరాబాయి చానూ తెలిపారు. సిల్వర్ గర్ల్ చానూ తన పుట్టిన రోజు సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 

Updated Date - 2021-08-09T17:21:30+05:30 IST