అరబిందో సేవలు ప్రశంసనీయం: మంత్రి రాజా

ABN , First Publish Date - 2022-08-10T05:29:48+05:30 IST

తొండంగి, ఆగస్టు 9: విద్యారంగంలో అరబిందో ఫార్మా షౌండేషన్‌ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. మంగళవారం పెరుమాళ్ళపురంలో ఆయన అరబిందో ఫార్మా షౌండేషన్‌ తరపున సెజ్‌ ప్రభావిత గ్రామాల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులకు రూ.38లక్షల విలువైన 750 సైకి ళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి తొలివిడతగా 400 సైకిళ్ళను అందించారు. 28 అంగన్వాడీ కేందాల కు రూ.15

అరబిందో సేవలు ప్రశంసనీయం: మంత్రి రాజా

తొండంగి, ఆగస్టు 9: విద్యారంగంలో అరబిందో ఫార్మా షౌండేషన్‌ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. మంగళవారం పెరుమాళ్ళపురంలో ఆయన అరబిందో ఫార్మా షౌండేషన్‌ తరపున సెజ్‌ ప్రభావిత గ్రామాల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులకు రూ.38లక్షల విలువైన 750 సైకి ళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి తొలివిడతగా 400 సైకిళ్ళను అందించారు. 28 అంగన్వాడీ కేందాల కు రూ.15 లక్షల విలువైన వస్తు సామగ్రిని పంపిణీ చేశారు. కేంద్రీకృత వంటశాల ద్వారా 5వేలమంది విద్యార్థులకు అల్పాహారం అందించే ఏర్పాటు చేస్తున్న అరబిందో యాజమాన్యాన్ని అభినందించారు. తుని మార్కెట్‌యార్డ్‌ చైర్మన్‌ కొయ్యా మురళి, అరబిందో సీనియర్‌ అధికారి రామకృష్ణ, ఎంపీపీ అరుణ కు మార్‌, వైస్‌ ఎంపీపీ నాగం గంగబాబు, ఐసీడీఎస్‌ పీడీ ప్రవీణ, జడ్పీ వైస్‌ చైర్మన్‌ పద్మలత, ఎంపీడీవో సతీష్‌, ఎంఈవో షేక్‌ బాబ్జి, పాల్గొన్నారు. కొమ్మనాపల్లిలో బాబూ జగజ్జీవన్‌రామ్‌ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఉన్నత పాఠశాలలో నాడు- నేడు పథ కం ద్వారా రూ.63 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కోన అమ్మజీ సూర్యనారాయణ, మాకినీడి బాబు, కోన గంగా ఈశ్వర్‌, ఎంపీటీసీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-10T05:29:48+05:30 IST