సోషల్ మీడియాలో 15 ఏళ్ల కూతురి నగ్న వీడియో.. అనుకోకుండా చూసిన తల్లిదండ్రులు.. చివరకు..

ABN , First Publish Date - 2021-08-29T18:18:30+05:30 IST

ప్రస్తుత కరోనా కాలంలో స్కూళ్లు, కాలేజీలు అన్నీ మూతపడి ఉన్నాయి. దీంతో అందరూ ఆన్‌లైన్‌లో చదువులు సాగిస్తున్నారు. ఆ ఆన్‌లైన్ చదువుల పుణ్యమా అని అప్పటి వరకూ సాధారణ మొబైల్స్ వాడిన విద్యార్థులకు కూడా ఖరీదైన మొబైల్స్ అవసరమయ్యా

సోషల్ మీడియాలో 15 ఏళ్ల కూతురి నగ్న వీడియో.. అనుకోకుండా చూసిన తల్లిదండ్రులు.. చివరకు..

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత కరోనా కాలంలో స్కూళ్లు, కాలేజీలు అన్నీ మూతపడి ఉన్నాయి. దీంతో అందరూ ఆన్‌లైన్‌లో చదువులు సాగిస్తున్నారు. ఆ ఆన్‌లైన్ చదువుల పుణ్యమా అని అప్పటి వరకూ సాధారణ మొబైల్స్ వాడిన విద్యార్థులకు కూడా ఖరీదైన మొబైల్స్ అవసరమయ్యాయి. ఇలా చదువు కోసం తల్లిదండ్రులు కొనిపెట్టే మొబైల్స్‌ను పిల్లలు ఇష్టానుసారం ఉపయోగించుకొని తల్లిదండ్రుల ప్రాణాల మీదకు తెస్తున్నారు. ఇలాంటి ఘటనే గుజరాత్‌లో వెలుగు చూసింది. అహ్మదాబాద్‌కు చెందిన ఒక 15 ఏళ్ల బాలిక కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటోంది. ఆన్‌లైన్ క్లాసుల కోసం తల్లిదండ్రులు ఆమెకు ఒక మొబైల్ ఫోన్ కొనిపెట్టారు. అంతా సాఫీగా జరుగుతుండగా.. వీళ్ల బంధువుల అమ్మాయి ఆ తల్లిదండ్రులకు ఒక రోజు షాకింగ్ వీడియో పంపింది. దానిలో వీళ్ల 15 ఏళ్ల కుమార్తె నగ్నంగా కనిపిస్తోంది. అది చూడగానే ఆ తల్లిదండ్రులిద్దరికీ మైనర్ హర్ట్‌ఎటాక్ వచ్చింది.



విషయం తెలుసుకున్న బంధువులు హడావుడిగా ఆ తల్లిదండ్రులను ఆస్పత్రికి తరలించారు. వెంటనే 181 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి మైనర్ బాలికకు కౌన్సెలింగ్ ఇప్పించారు. ఆ సమయంలో తనకు అసలు ఆ అలవాటు ఎలా అయిందో ఆ బాలిక వెల్లడించింది. ఆన్‌లైన్ క్లాసులు చూస్తుండగా ఒక వెబ్‌సైట్ ఆమెకు తగిలింది. ఆ వెబ్‌సైట్‌లో కొంతమంది అమ్మాయిలు ప్రతిరోజూ న్యూడ్ వీడియోలు పోస్ట్ చేస్తున్నారట. వాటి కింద వందలాదిమంది అబ్బాయిల కామెంట్లు కూడా ఉన్నాయట. అవన్నీ చూసిన ఈ అమ్మాయి తను కూడా కామెంట్లకు రిప్లైలు ఇవ్వడం ప్రారంభించింది. దీంతో ఆ వెబ్‌సైట్‌లోని అబ్బాయిలు ఆమెను కూడా నగ్న వీడియోలు తీసి అప్‌లోడ్ చేయాలని అడిగారట. వాళ్లు అంతలా అడగడంతో ఒక వీడియో తీసి పోస్టు చేసిందీ బాలిక. దానికి విపరీతమైన స్పందన రావడంతో అది అలవాటుగా మారింది. ఆ వెబ్‌సైట్‌లో ఆమె అప్‌లోడ్ చేసిన వీడియోలన్నింటినీ తొలగించిన అధికారులు.. సైబర్ నేరాలు ఎలా జరుగుతాయో ఆమెకు వివరించారు. ఆ తర్వాత తల్లిదండ్రుల అనుమతి లేకుండా మొబైల్ ముట్టుకోనని ఆ బాలిక ఒట్టేసింది. దీంతో ఆ తల్లిదండ్రుల ఆందోళన ఒకింత సద్దుమణిగింది.


Updated Date - 2021-08-29T18:18:30+05:30 IST