మైనార్టీ విద్యార్థులు విద్యలో రాణించాలి

ABN , First Publish Date - 2021-10-26T04:46:41+05:30 IST

ప్రస్తుత మైనార్టీ విద్యార్థులు విద్యలో వెనుకబాటుతనంలో ఉన్నారని వారు విద్యలో రాణించాలని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి పిలుపునిచ్చారు.

మైనార్టీ విద్యార్థులు విద్యలో రాణించాలి
కరపత్రాన్ని విడుదల చేస్తున్న ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి

ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి


కడప (ఎడ్యుకేషన్‌), అక్టోబరు 25 : ప్రస్తుత మైనార్టీ విద్యార్థులు విద్యలో వెనుకబాటుతనంలో ఉన్నారని వారు విద్యలో రాణించాలని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి పిలుపునిచ్చారు. కడప నగరం రామాంజనేయపురంలోని ఏపీ మైనార్టీ గురుకుల పాఠశాలను సోమవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నాడు-నేడుతో పాఠశాలలను బలోపేతం చేసిందన్నారు. తద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయన్నారు. మైనార్టీ గురుకుల పాఠశాలలో తల్లిదండ్రులు తమ పిల్లల్ని చేర్పించి ప్రభుత్వ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు పెంచాలని కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ అబ్దుల్‌ రసూల్‌, ఉపాధ్యాయులు, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎండీ ఇలియా్‌సబాషా, జిల్లా నాయకులు రామాజంనేయులు, సికిందర్‌బాషా పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-26T04:46:41+05:30 IST