Abn logo
Feb 23 2021 @ 11:16AM

మైనర్లకు వాహనాలిస్తే తల్లిదండ్రులపై కేసులు

హైదరాబాద్/పహాడిషరీఫ్‌ : తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని బాలాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ భాస్కర్‌ అన్నారు. సోమవారం జల్‌పల్లి గేట్‌ వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్‌ ధరించాలని అన్నారు.  ఈ తనిఖీలో ఎస్సైలు మధు, వెంకట్‌రెడ్డి, వినయ్‌, నాగరాజులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement