పూలే వారసులుగా ఆశయాలను నిలబెడతాం: మంత్రి వేణుగోపాలకృష్ణ

ABN , First Publish Date - 2020-11-28T18:26:27+05:30 IST

మహాత్మా జ్యోతీరావ్ పూలే 130 వర్ధంతి సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దఆయన విగ్రహానికి మంత్రులు పూల మాలలు వేసి నివాళి అర్పించారు.

పూలే వారసులుగా ఆశయాలను నిలబెడతాం: మంత్రి వేణుగోపాలకృష్ణ

విజయవాడ: మహాత్మా జ్యోతీరావ్ పూలే 130 వర్ధంతి సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దఆయన విగ్రహానికి  మంత్రులు  పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ...యుగ పురుషులు జ్యోతీరావ్ పూలే ఆశయాలు తీరే తరుణం సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాబోతోందని తెలిపారు. 130 సంవత్సరాల క్రితం మరణించిన మహాత్మా పూలేను స్మరించుకుటున్నామంటే ఆయన ఆశయాలే మనల్ని నడిపిస్తున్నాయని చెప్పారు. 


సీఎం జగన్ మోహన్ రెడ్డి రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా మహిళలకు, బలహీన వర్గాలకు పదవుల్లో, పనుల్లో 50 శాతం అవకాశాలు కల్పించారని అన్నారు. 56 బీసీ కార్పొరేషన్‌లను ఏర్పాటు చేసి బీసీలకు సీఎం పెద్దపీట వేశారని చెప్పుకొచ్చారు. పూలే వారసులుగా ఆయన ఆశయాలను నిలబెడతామని మంత్రి వేణుగోపాల కృష్ణ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, ధర్మాన కృష్ణదాస్, ఎమ్యెల్యే మల్లాది విష్ణు, బీసీ కార్పొరేషన్‌ల చైర్మెన్‌లు, బీసీ, దళిత నేతలు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-28T18:26:27+05:30 IST