Advertisement
Advertisement
Abn logo
Advertisement

కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి

విజయవాడ:  ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.  స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి  అలంకారంలో ఉన్న అమ్మవారిని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు భక్తులకు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశామన్నారు. క్యూలైన్లో కేశఖండన శాల, అన్నప్రసాదాలు, శానిటేషన్ అన్నిరకాల సిబ్బంది సమన్వయంతో పని చేస్తున్నారని తెలిపారు. ప్రత్యక్ష పరోక్ష పూజలకు కూడా అన్ని విధాల ఏర్పాట్లు చేశామని చెప్పారు. వీఐపీల తాకిడి ఉన్నా సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా 5 వరుసలు క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు. 12న మూలానక్షత్రం రోజున ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సీఎం ఆలయానికి వస్తారని తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దసరా నవరాత్రులు జరుపుకోవాలని సూచించారు. గతంలో కొండచరియలు పడటంలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. తిరుపతి తర్వాత రెండో దేవాలయంగా విజయవాడ ఇంద్రకీలాద్రిని తయారు చేస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement