పశువులకు, గొర్రెలకు జీవిత బీమా వర్తింపు

ABN , First Publish Date - 2020-09-25T10:21:20+05:30 IST

పశువులకు, గొర్రెలకు జీవిత బీమా వర్తింపజేయాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

పశువులకు, గొర్రెలకు జీవిత బీమా వర్తింపు

రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌


నాగర్‌కర్నూల్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): పశువులకు, గొర్రెలకు జీవిత బీమా వర్తింపజేయాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. గురువారం హైదరాబాద్‌ నుంచి పశుసంవర్ధక శాఖ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అనితా రాజేంద్రతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాల వల్ల పశువులకు ఎలాంటి వ్యాధులు సంక్రమించకుండా చ ర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పశువులకు, గొర్రెలకు జీవిత బీమా వర్తింపజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. జీవిత బీమాకు సంబంధించి అక్టోబరు 15వ తేదీ నాటికి పూర్తిస్థాయి గైడ్‌లైన్స్‌ను వి డుదల చేస్తామని ఆయన తెలిపారు. 33శాతం గొర్రెలకు ఇవ్వనున్న పారుడు రోగాల టీకాలను వెంటనే పూర్తి చేయాలన్నారు. పశువులకు, గొర్రెలకు సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సిబ్బంది అంద రూ ప్రతి రోజు గ్రామాల్లో సందర్శిస్తూ రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.


సిబ్బంది క్షేత్ర స్థా యి పర్యటనలకు హాజరు కాకుంటే చర్యలు తప్పవని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. విజయ డెయిరీ పార్లర్‌లను జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయిలో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్ల డించారు. రైతుబంధు, రైతుబీమా, సబ్సిడీ, జొన్నలు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతూ ప్రైవేట్‌ డెయిరీలకు రైతులు పాలు పోస్తే సంబంధిత మేనేజర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా.అంజిలప్ప, ఏడీలు శ్రీనివాస్‌రావు, ఆదిత్య, పాల డెయిరీ అధికారి సత్యనారాయణ, అభ్యుదయ రైతులు రామచంద్రారెడ్డి, రూకయ్యయాదవ్‌, గోపాల మిత్ర సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-25T10:21:20+05:30 IST