‘మంత్రి చెప్పారు.. జిల్లాకు రూ. 5 లక్షలు వసూలు చేయండి’

ABN , First Publish Date - 2021-06-22T17:20:03+05:30 IST

రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి రూ. 5 లక్షలు ఇవ్వాలని మంత్రి చెప్పారంటూ అబ్కారీశాఖ అధికారి ఒకరు మాట్లాడిన ఆడియో వైరల్‌ అయింది. రాష్ట్రంలో 30 జిల్లాలు ఉండగా అన్ని జిల్లాల నుంచి రూ.

‘మంత్రి చెప్పారు.. జిల్లాకు రూ. 5 లక్షలు వసూలు చేయండి’

                 - అబ్కారీ అధికారి ఆడియో వైరల్‌ 


బెంగళూరు: రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి రూ. 5 లక్షలు ఇవ్వాలని మంత్రి చెప్పారంటూ అబ్కారీశాఖ అధికారి ఒకరు మాట్లాడిన ఆడియో వైరల్‌ అయింది. రాష్ట్రంలో 30 జిల్లాలు ఉండగా అన్ని జిల్లాల నుంచి రూ.5 లక్షలు చొప్పున అబ్కారీ మంత్రి గోపాలయ్య సూచించారనే ఆడియో హల్‌చల్‌ చేస్తోంది. దీనిపై మంత్రి గోపాలయ్య సోమవారం విధానసౌధలో స్పందించారు. తాను ఎవరికీ డబ్బులు వసూలు చేయమని సూచించలేదని, తనను మానసికంగా ఇబ్బంది పెట్టేందుకు కుట్ర పన్నారని, విచారణ జరపాలని అబ్కారీశాఖ కమిషనర్‌ను ఆదేశించానన్నారు. విచారణ పూర్తయితే ఆడియోలో మాట్లాడినవారు ఎవరో తేలుతుందన్నారు. 

Updated Date - 2021-06-22T17:20:03+05:30 IST