అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్ : Talasani

ABN , First Publish Date - 2021-08-21T17:43:51+05:30 IST

అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్ : Talasani

హైదరాబాద్: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం వెస్ట్ మారేడ్‌పల్లిలో జలమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి తలసాని ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీతో పాటు 190 గ్రామాలకు జలమండలి సేవలు అందిస్తుందన్నారు. కార్మికుల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని ఆధునిక టెక్నాలజీతో మ్యాన్ హొల్స్‌లలో పూడిక తొలగింపు జరుగుతుందని తెలిపారు. 2014కు ముందు త్రాగునీటి కోసం ఖాళీ బిందెలతో నిత్యం ఆందోళనలు జరిగేవని.... నేడు ఆ పరిస్థితులు లేవని చెప్పారు. అప్పటి జనాభాకు అనుగుణంగా ఏర్పాటు చేసిన డ్రైనేజి, త్రాగునీటి వ్యవస్థ కారణంగానే కొన్ని ఇబ్బందులు ఎదురైనట్లు తెలిపారు. ప్రస్తుతం పెరిగిన జనాభాకు అనుగుణంగా త్రాగునీటి సరఫరా, డ్రైనేజి వ్యవస్థ అభివృద్ధి జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-21T17:43:51+05:30 IST