ప్రతిభకు పట్టం కట్టేందుకే ఆప్కాస్‌ : మంత్రి సురేష్‌

ABN , First Publish Date - 2020-07-04T10:53:51+05:30 IST

ప్రతిభకు పట్టం కట్టేందుకే ఆప్కాస్‌(ఆంధ్రప్రదేశ్‌ ఔట్‌ సో ర్సింగ్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌)ను ప్రభుత్వం ప్ర వేశపెట్టిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి

ప్రతిభకు పట్టం కట్టేందుకే ఆప్కాస్‌ : మంత్రి సురేష్‌

ఒంగోలు(కలెక్టరేట్‌), జూలై 3 : ప్రతిభకు పట్టం కట్టేందుకే ఆప్కాస్‌(ఆంధ్రప్రదేశ్‌ ఔట్‌ సో ర్సింగ్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌)ను ప్రభుత్వం ప్ర వేశపెట్టిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూ లపు సురేష్‌ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మో హన్‌రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌లో ఆప్కాస్‌ వెబ్‌సైట్‌ను ప్రారం భించారు. అనంతరం కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో మంత్రి సురేష్‌ మాట్లాడుతూ ఔ ట్‌సోర్సింగ్‌ విధానంతో ఇష్టారీతిన వ్యవహరి స్తున్న ఏజెన్సీల అక్రమాలకు సీఎం ముకుతాడు వేశారన్నారు.


నెలల తరబడి వేతనాలు అందక పోవడం, వేతనాల్లో కోత విధించే విధానాలకు ప్రభుత్వం స్వస్తి పలికిందని చెప్పారు. పొరుగు సేవల ఉద్యోగులకు ఆప్కాస్‌తో భరోసా కల్పించి వ్యవస్థను మరింత పటిష్ట పరిచేందుకు ప్రభు త్వం నూతన విధి విధానాలను ప్రవేశపెట్టింద ని ఆయన తెలిపారు. కలెక్టర్‌ పోలా భాస్కర్‌ మాట్లాడుతూ జిల్లాలో వంద ప్రభుత్వ శాఖల్లో 5416 మంది పొరుగు సేవల పద్ధతిలో పనిచే స్తున్నారని తెలిపారు. ప్రస్తుతం 2969 మందిని ఆప్కాస్‌లోకి మిళితం చేశామన్నారు. అనంతరం పొరుగు సేవల ఉద్యోగులకు ఆప్కాస్‌ నుంచి ధృవీకరణ పత్రాలను మంత్రి సురేష్‌, కలెక్టర్‌ భాస్కర్‌, ఎమ్మెల్సీ సభ్యురాలు పోతుల సునీత లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జేసీ వెం కటమురళీ, ఇన్‌చార్జి డీఆర్వో కృష్ణవేణి, వివిధ శాఖల అధికారులు వెంకటేశ్వర్లు, వీఎస్‌.సుబ్బా రావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-04T10:53:51+05:30 IST