చద్దన్నం గురించి ఆరోగ్యశాఖ మంత్రి ఏం చెప్పారో తెలిస్తే...

ABN , First Publish Date - 2022-03-13T13:49:50+05:30 IST

అల్లోపతి వైద్యం వల్ల కూడా నయం కాని జీర్ణకోశ సమస్యలకు ‘చద్దన్నం’ దివ్య ఔషధంలాంటిదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. స్థానిక రాయపురం నియోజకవర్గంలోని ప్రభుత్వ స్టాన్లీ

చద్దన్నం గురించి ఆరోగ్యశాఖ మంత్రి ఏం చెప్పారో తెలిస్తే...

- ‘అది రోగాలను నివారించే దివ్య ఔషధం’

- సుబ్రమణ్యం


ప్యారీస్‌(చెన్నై): అల్లోపతి వైద్యం వల్ల కూడా నయం కాని జీర్ణకోశ సమస్యలకు ‘చద్దన్నం’ దివ్య ఔషధంలాంటిదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. స్థానిక రాయపురం నియోజకవర్గంలోని ప్రభుత్వ స్టాన్లీ ఆసుపత్రిలో రూ.2.44 కోట్ల వ్యయంతో అత్యాధునిక వసతులతో నిర్మించిన ప్రత్యేక వైద్య విభాగం, పరిశోధన కేంద్రాన్ని శనివారం మంత్రి సుబ్రమణ్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ... ప్రభుత్వ స్టాన్లీ ఆసుపత్రిలో రూ.14.5 కోట్ల వ్యయంతో స్టెమ్‌ సెల్‌ పరిశోధన కేంద్రం గత 2009 నుంచి ప్రజలకు అందుబాటులో ఉందని, ఇలాంటి అత్యున్నత వైద్య పరిశోధన కేంద్రం ఇక్కడ మాత్రమే ఉందన్నారు. పరిశోధన రంగంలో ప్రపంచస్థాయిలో ఆధునిక పరిశోధనలు చేపడుతూ స్టాన్లీ ఆసుపత్రి అగ్రస్థానంలో ఉందని, ఈ విభాగం తరపున ఏడు పరిశోధన పత్రాలకు ప్రపంచ దేశాలు అంగీకారం లభించిందన్నారు. భారత గ్రామీణ ప్రాంతాల్లోని సంప్రదాయ ఆహారాల్లో ఒకటైన చద్దన్నంలో ఔషధ గుణాలు మెండుగా ఉన్నట్లు ఇటీవల పరిశోధనల్లో తేలిందని తెలిపారు. అలోపతి మందుల వల్ల నయంకాని వ్యాధులు కూడా చద్దన్నం నయం చేస్తోందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి డా.జె.రాధాకృష్ణన్‌, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ డా. నారాయణబాబు, స్టాన్లీ ఆసుపత్రి డీన్‌ డా.బాలాజి, డా. జమీల, డా.జస్వంత్‌, ఎమ్మెల్యే ఐడ్రీమ్‌ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-13T13:49:50+05:30 IST