వ్యాక్సిన్‌ వేసుకున్నవారికే మద్యం: Minister Subramaniam

ABN , First Publish Date - 2021-11-29T16:41:10+05:30 IST

రాష్ట్రంలో రెండు విడతల వ్యాక్సిన్‌ వేసుకున్నవారికే టాస్మాక్‌ దుకాణాల్లో మద్యం విక్రయిస్తారని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం ప్రకటించారు. స్థానిక అడయార్‌ ప్రాంతంలో ఆది వారం ఉదయం ఏర్పాటైన 12వ విడత వ్యాక్సిన్‌ శిబిరాన్ని మంత్రి

వ్యాక్సిన్‌ వేసుకున్నవారికే మద్యం: Minister Subramaniam

చెన్నై: రాష్ట్రంలో రెండు విడతల వ్యాక్సిన్‌ వేసుకున్నవారికే టాస్మాక్‌ దుకాణాల్లో మద్యం విక్రయిస్తారని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం ప్రకటించారు. స్థానిక అడయార్‌ ప్రాంతంలో ఆది వారం ఉదయం ఏర్పాటైన 12వ విడత వ్యాక్సిన్‌ శిబిరాన్ని మంత్రి పొన్ముడితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో సుబ్రమణ్యం మాట్లాడుతూ రాష్ట్రంలో 70లక్షల మందికి పైగా రెండో డోస్‌ వ్యాక్సిన్‌ వేసుకోలేదని, ఇప్పటివరకూ 77.33 శాతం మంది మొదటి విడత, 42.04 శాతం మంది రెండో విడత వ్యాక్సిన్‌ వేసుకున్నారని తెలిపారు.  ఇకపై టీకాలు వేసుకున్నవారికే టాస్మాక్‌ దుకాణాల్లో మద్యం విక్రయిం చాలని ఆదేశించినట్లు ఆయన చెప్పారు. మద్యం కొనేవారు టీకా వేసుకు న్నారా లేదా అని ఆయా జిల్లాల కలెకర్టర్లు తనిఖీ చేయనున్నారని ఆయన పేర్కొన్నారు. 


ఒమైక్రాన్‌కు అడ్డుకట్ట... : రాష్ట్రం రూపు మార్చుకున్న కరోనా వైరస్‌ ‘ఒమైక్రాన్‌’ వ్యాప్తిని నిరోధిం చేందుకు పట్టిష్టమైన చర్యలు చేపుడుతున్నట్లు ఆయన తెలిపారు. ఆ మేరకు కొత్త వైరస్‌ వ్యాప్తి చెందిన 12 దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే విదేశీ ప్రయాణికులను ఎనిమిది రోజులపాటు ఐసోలేషన్‌లో ఉంచి వైద్యపరీక్ష లు నిర్వహి స్తామని ఆయన చెప్పారు. ఇటలీ, సింగపూరు, మలే ిసియా సహా 12 దేశాల నుంచి వచ్చే ప్రయాణి కులకు తప్పనిసరిగా వైద్య పరీక్షలు జరిపి ఐసోలేషన్‌ లో ఉంచు తామని చెప్పా రు. ఈ శిబిరాన్ని ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి జె.రాధా కృష్ణన్‌, మంత్రి పొన్ముడి, వేళచ్చేరి శాసన సభ్యుడు జేహెచ్‌ఎం అసన్‌ మౌలా నా, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌దీప్‌ సింగ్‌ బేదీ పరిశీలించారు.


టీకాలకు బారులుతీరిన జనం... : రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ఉదయం ఏడు గంటల కు 12 వ విడత మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ప్రారంభ మైంది. రాష్ట్రంలో యాభై వేల ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో వ్యాక్సిన్‌ వేసుకునేందుకు ప్రజలు బారులు తీరారు.  ఇలా ఇప్పటివరకు 11 శిబిరాలు పూర్తయ్యాయి. గత గురువారం నిర్వహిం చిన 11 వ విడత శిబిరాలలో సుమారు 12 లక్షల మంది టీకాలు వేసు కున్నారు. రాష్ట్రంలో కోటి డోస్‌లకు పైగా కొవాక్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలు నిల్వ ఉన్నాయి. దీంతో ఆదివారం 13 లక్షలమందికి వ్యాక్సిన్‌ వేయాలని ఆరోగ్యశాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కార్పొరేషన్‌లోని 200 వార్డుల్లో 1600 వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ శిబిరాల్లో సుమారు రెండు లక్షలమందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌దీప్‌ సింగ్‌బేదీ తెలిపారు.

Updated Date - 2021-11-29T16:41:10+05:30 IST