Advertisement
Advertisement
Abn logo
Advertisement

సింహం ఒక్క అడుగు వెనక్కి వేస్తే ...: Srinivas

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ వాపును చూసి బలుపు అనుకుంటున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ ఎదో ఒక్క సీటు గెలిస్తే అదే తమ బలం అనుకుంటే పొరపాటన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా పథకాలు, కార్యక్రమాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న నేతలు చాలామంది టీఆర్‌ఎస్ పాలనను అభినందిస్తున్నారని చెప్పారు. ఢిల్లీ నుండి వచ్చిన తరువాత సీఎం మౌనంగా ఉంటున్నారు అనడంలో అర్థం లేదన్నారు. సింహం ఒక్క అడుగు వెనక్కి వేస్తే ...పది అడుగులు ముందుకు వేస్తుందని చెప్పుకొచ్చారు. బీజేపీ పార్టీలోకి వెళ్లే కర్మ టీఆర్‌ఎస్ నేతలకు పట్టలేదన్నారు. రాజకీయ లాభాల కోసం బీజేపీ నేతలు పిచ్చి కూతలు కుస్తున్నారని మండిపడ్డారు. మరో పదేళ్లు తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వమే ఉంటుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. 

Advertisement
Advertisement