విశాఖ ఉత్తరాంధ్రకు గుండెకాయ

ABN , First Publish Date - 2020-08-02T10:12:11+05:30 IST

విశాఖపట్నం ఉత్తరాంధ్రకు గుండెకాయ లాంటిదని మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు.

విశాఖ ఉత్తరాంధ్రకు గుండెకాయ

 మంత్రి సీదిరి అప్పలరాజు

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, ఆగస్టు 1: విశాఖపట్నం ఉత్తరాంధ్రకు గుండెకాయ లాంటిదని మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. శనివారం ఆయన వైసీపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విశాఖను రాజధా నిగా ప్రకటించడం హర్షించతగ్గదని చెప్పారు. అమరావతిని రాజధానిగా రూప కల్పన చేయడానికి ముందే చంద్రబాబు తన బంధుగణానికి ఆస్తులు సమకూర్చారని విమర్శించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి సీఎం జగన్‌కు చిత్తశుద్ధి ఉందని వివరించారు. కొద్దిరోజుల్లోనే విశాఖ నుంచి పాలన ప్రారంభమవుతుందని మంత్రి స్పష్టం చేశారు. 


  వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి: ఎమ్మెల్యే ధర్మాన

పాలనా వికేంద్రీకరణతోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. వికేంద్రీకరణ బిల్లును ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రూపొందించడం, దానికి గవర్నర్‌ ఆమోదముద్ర వేయడంపై హర్షం వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే సీఎం  లక్ష్యమని తెలిపారు.


 రణస్థలం: ప్రజా సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ధ్యేయమని ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ అన్నారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా శనివారం మండల కేంద్రంలోని దివంగతనేత వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు జరుగుళ్ల శంకరరావు, ఇడదాసుల తిరుపతిరాజు, టేక్‌ బ్రహ్మాజి, దన్నాన సీతారాం, పచ్చిగుళ్ల సాయిరాం, మీసాల రామారావు తదితరులు పాల్గొన్నారు. 


ఆమదాలవలసరూరల్‌: పాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని వైసీపీ మండల అధ్యక్షుడు తమ్మినేని శ్రీరామ్మూర్తి అన్నారు. మూడు రాజధానులకు గవర్నర్‌ ఆమోదం లభించడంతో శనివారం స్థానిక వైఎస్సార్‌ కూడలి వద్ద  వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి హర్షం వ్యక్తం చేశారు.  కార్యక్ర మంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు.


పాలకొండ రూరల్‌: మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్‌ ఆమోదం తెలపడంపై ఎమ్మెల్యే వి.కళావతి, డీసీసీబీ చైర్మన్‌ పాలవలస విక్రాంత్‌లు హర్షం తెలిపారు. ఈ మేరకు శనివారం వైఎస్‌ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఈ నిర్ణయం చారిత్రాత్మకమైనదని అన్నారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. 


కవిటి: మూడు రాజధానులతో రాష్ట్రాభివృద్ధి సాధ్యపడుతుందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి నర్తు రామారావు తెలిపారు. మూడు రాజధానులకు గవర్నర్‌ ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు కడియాల ప్రకాష్‌, నర్తు చామంతి తదితరులు పాల్గొన్నారు.


గుజరాతీపేట:మూడు రాజధానుల బిల్లును గవర్నర్‌ ఆమోదించడాన్ని  స్వాగతిస్తున్నామని ఏపీఎన్‌జీవో సంఘం రాష్ట్ర సహా అధ్యక్షుడు చౌదరి పురుషోత్తం నాయుడు తెలిపారు. శనివారం స్థానిక ఎన్‌జీవో హోంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు.   


రాజధాని విశాఖలో ఉండడం వల్ల ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతున్నారు. కార్యక్రమంలో ఏపీఎన్‌జీవో సంఘ నాయకులు హనుమంతు సాయిరాం,  కాయల శ్రీనివాసరావు, రాయి వేణగోపాల్‌,  బడగల పూర్ణచంద్రరావు, అట్ల సూర్యప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-02T10:12:11+05:30 IST