రైతులను ఆదుకుంటాం

ABN , First Publish Date - 2020-11-30T05:55:52+05:30 IST

నివర్‌ తుఫాన్‌ కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర రో డ్లు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ పేర్కొన్నారు

రైతులను ఆదుకుంటాం
దెబ్బతిన్న వరిపంటను పరిశీలిస్తున్న మంత్రి శంకరనారాయణ

 నివర్‌తో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి శంకరనారాయణ 


కదిరి అర్బన్‌, నవంబరు 29 : నివర్‌ తుఫాన్‌ కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర రో డ్లు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ పేర్కొన్నారు. ఆయన ఆదివారం కది రి మండల పరిధిలోని కదిరి కుంట్లపల్లి ప్రాం తంలో ఎమ్మెల్యే పీవీ సిద్దారెడ్డితో కలసి పర్యటించారు. తుఫాన్‌ కారణంగా దెబ్బ తిన్న వరి పంటను నేరుగా పొలాల్లోకి వెళ్లి పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ నివర్‌ తుఫాన్‌ కారణంగా నెల్లూరు, చిత్తూరు, కడప, జిల్లాలోని కదిరి ప్రాంతంలో వరిపంట పూర్తిగా దెబ్బ తిందన్నారు.  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం నెల్లూరు, చిత్తూరు, కడప ప్రాం తాల్లో హెలిక్యాప్టర్‌లో పరిశీలించారని, క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి తాను కదిరి ప్రాంతంలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. తుఫాన్‌ కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. కదిరి నియోజకవర్గంలో నా లుగు మండలాల్లో తుఫాన్‌ ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. దా దాపు 1300 హెక్టార్లలో వరిపంట దెబ్బతినిందని వ్యవసాయ శాఖ అధికారులు అంచ నా వేసినట్లు తెలిపారు. నష్టపోయిన రైతులందరికి పంట నష్టపరిహారం అందజేస్తామన్నారు.  కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటరెడ్డి, ఏడీఏ సత్యనారాయణ, వ్యవసాయ అధికారి షాదాబ్‌, వైసీపీ మండల కన్వీనర్‌ ప్రకాశ్‌, నాయకులు సుధీర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, లోకే్‌షరెడ్డి, నారాయణ, కుళ్ళాయిరెడ్డి, రామచంద్ర, స్థానిక నాయకులు పాల్గొన్నారు. 



Updated Date - 2020-11-30T05:55:52+05:30 IST