రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌

ABN , First Publish Date - 2020-09-25T10:12:43+05:30 IST

రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు బంధావుడిగా చరిత్రకెక్కారని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు.

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌

మంత్రి సబితాఇంద్రారెడ్డి


తాండూరు : రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు బంధావుడిగా చరిత్రకెక్కారని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. గురువారం తాం డూరు పట్టణంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి రైతుల ట్రాక్టర్ల ర్యాలీని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. వ్యవసాయ రం గంలో తెలంగాణను కేసీఆర్‌ దేశంలోనే నెంబర్‌-1గా తీర్చిదిద్దారని అన్నారు. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. నూతన రెవెన్యూ చట్టం ద్వారా ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన రైతుల సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ.. నూతన రెవెన్యూ చట్టం వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. రైతు వేదికల నిర్మాణాలతో వ్యవసాయ రంగాన్ని రైతుల వద్దకు తీసుకువస్తున్నారని అన్నారు.


ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు ప్రైవేటు ఉద్యోగాల కల్పనకు కృషి

ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు ప్రైవేటు ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణ ఆర్యవైశ్య కల్యాణ మంటపంలో పట్ట భద్రుల ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా కో-ఆర్డినేటర్ల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక పెట్టుబడులను ఆహ్వానిస్తూ నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నదని అన్నారు. పట్టభద్రుల స్థానం కోసం పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని అన్నారు. పట్టభద్రుల జాబితా సిద్ధం చేసుకుని కో-ఆర్డినేటర్లు, పార్టీశ్రేణులు ఎప్పటికప్పుడు దగ్గరవ్వాలని అన్నారు. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. డిగ్రీపాసైన వారందరూ సభ్యత్వ నమోదు చేసుకోవాలని, ప్రతి నియోజకవర్గంలో సభ్యత్వ నమోదుకు పార్టీ లక్ష్యం విధించిందని అన్నారు.


40 రోజుల ముందుగానే ప్రణాళికను సిద్ధం చేశారన్నారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రాడ్యూయేట్ల ఓటింగ్‌ శాతం పెరగాలని, ఇందుకు ఎన్‌రోల్‌మెంట్‌ తప్పనిసరిగా పేర్కొన్నారు. రాష్ట్ర విద్యా మౌలిక వసతుల కల్పన చైర్మన్‌ నాగేందర్‌గౌడ్‌ మాట్లాడుతూ.. పట్టణ భద్రులు అనేక మంది ఓటు హక్కుకు దూరంగా ఉంటున్నారని పేర్కొన్నారు. ఓటును వినియోగించుకునేందుకు వారంతా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్‌ చైర్‌రప్సన్‌ స్వప్న, మాజీ చైర్మన్‌ లక్ష్మారెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, మాజీ జెడ్పీటీసీ రవీందర్‌గౌడ్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ దీపా, యాలాల ఎంపీపీ బాలేశ్వర్‌గుప్తా, తాండూరు జెడ్పీటీసీ మంజుల, పట్టణ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ రవూఫ్‌, నాయకులు నారా మహిపాల్‌రెడ్డి, విఠల్‌నాయక్‌, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-25T10:12:43+05:30 IST