కర్నూలు: జగన్ మళ్లీ సీఎం కావాలని జనం కోరుకుంటున్నారని మంత్రి రోజా చెప్పారు. చంద్రబాబు, లోకేష్ పదవుల కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. బాదుడే బాదుడు అంటూ లేనిపోని అబద్ధాలు మాట్లాడుతున్నారని, అనుభవం ఉందని చెప్పే చంద్రబాబు వైఎస్సార్, జగన్ లాగా సంక్షేమ పథకాలు తెచ్చారా? అని ప్రశ్నించారు. సీనియర్ సీఎంల కంటే ఫస్ట్ టైం సీఎం జగన్ ఎక్కువ అభివృద్ధి చేస్తున్నారని, కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా జగన్ మళ్లీ సీఎం కావాలని జనం కోరుకుంటున్నారని తెలిపారు.
ఇవి కూడా చదవండి