హైదరాబాద్: కేంద్ర విధానాల వల్లే ఆర్టీసీ ఛార్జీలను పెంచాల్సి వస్తోందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. కేంద్రం డీజిల్, పెట్రోల్‌పై ధరలు పెంచడంతో ఆర్టీసీపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. ప్రభుత్వం ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే ఆర్టీసీకి అంత మేలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.