Kamarajar వర్సిటీ స్నాతకోత్సవం బహిష్కరణ

ABN , First Publish Date - 2022-07-13T13:18:38+05:30 IST

మదురై కామరాజర్‌ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవాన్ని బహిష్కరించనున్నట్లు ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి ప్రకటించారు. నగరంలో మంగళవారం

Kamarajar వర్సిటీ స్నాతకోత్సవం బహిష్కరణ

                              - మంత్రి పొన్ముడి


పెరంబూర్‌(చెన్నై), జూలై 12: మదురై కామరాజర్‌ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవాన్ని బహిష్కరించనున్నట్లు ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి ప్రకటించారు. నగరంలో మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ కామరాజర్‌ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనే గవర్నర్‌ రాజకీయాలపై మాట్లాడే అవకాశముందనే వార్తలొస్తున్నాయన్నారు. స్నాతకోత్సవానికి సం బంధించి వర్సిటీ యాజమాన్యం ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే స్నాతకోత్సవం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారన్నారు. రాష్ట్రప్రభుత్వ విధానాలు, చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు నెరవేర్చడం గవర్నర్‌ బాధ్యత అని తెలిపారు. కానీ, గవర్నర్‌ బీజేపీ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. భారత దేశ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను గవర్నర్‌ చదవాలన్నారు. గవర్నర్‌ ఇతర విషయాలు దూరంపెట్టి, మానవతావాదాన్ని అనుసరించాలని మంత్రి సూచించారు.

Updated Date - 2022-07-13T13:18:38+05:30 IST